బిగ్ బాస్ సీజన్ 7 మరో 24 గంటల్లో ఫినిష్ అవ్వబోతుంది. సీజన్ 7 లో ఇంకా టాప్ 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్, అర్జున్ అంబటి లతో పాటుగా ప్రియాంక ఉన్నారు. అయితే ఈ ఆరుగురిలో మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ ప్రచారం జరిగినా ఆరుగురూ గ్రాండ్ ఫినాలే వరకు వచ్చేసారు. ఈరోజు శనివారం ఉదయం నుంచే సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూట్ మొదలైపోయింది. మధ్యలో సుమ తన కొడుకు రోషన్ కనకాలతో కలిస్ బబుల్ గమ్ ప్రమోషన్స్ తో సందడి చేసిన వీడియో షాట్స్ వైరల్ గా మారాయి.
అయితే టాప్ 6 నుంచి ముందుగా ఎవరు ఎలిమినేట్ అయ్యారో అనేది అప్పుడే లీకైపోయింది. బిగ్ బాస్ 7 మొదలైన ఒక నెల తర్వాత వైల్డ్ కార్డు అంటూ హౌస్ లోకి అడుగుపెట్టిన అర్జున్ అంబటి రెండు వారాల క్రితమే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. ఓటింగ్ పరంగా చివరి స్థానంలో ఉన్న అర్జున్ అంబటి రెండు వారాలముందే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. కానీ అర్జున్ టికెట్ టు ఫినాలే అస్త్ర గెలుచుకుని నేరుగా టాప్ 5 లోకి ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత ఫినాలే వీక్ కి ఓటింగ్స్ మొదలైనా అర్జున్ అంబటిని ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు.
అతను ఆటలో సూపర్, అణుకువలో అదుర్స్, అందరితో కలుపుగోలుగా ఉండడమే కాదు, ప్రతి టాస్క్ కష్టపడి గెలుస్తాడు, కానీ అర్జున్ కి జనాదరణ లేదు అనేది అతనికి రెండు వారల క్రితమే అర్ధమైంది. ఇప్పుడు టాప్ 6 నుంచి కూడా అర్జున్ అంబటి ముందుగా ఎలిమినేట్ అయినట్లుగా లీకులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అర్జున్ తర్వాత ఎవరు టాప్ 6 నుంచి బయటికి వస్తారో అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.