Advertisementt

అప్పుడు షణ్ముఖ్-సిరి, ఇప్పుడు శ్రీహన్-శ్రీసత్య

Sat 16th Dec 2023 05:07 PM
srihan,sri sathya  అప్పుడు షణ్ముఖ్-సిరి, ఇప్పుడు శ్రీహన్-శ్రీసత్య
Then Shanmukh-Siri, new Srihan-Sri Sathya అప్పుడు షణ్ముఖ్-సిరి, ఇప్పుడు శ్రీహన్-శ్రీసత్య
Advertisement
Ads by CJ

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 జరుగుతుంది. మరొక్క రోజులో బిగ్ బాస్ సీజన్ 7 పూర్తికాబోతుంది. గ్రాండ్ ఫినాలే కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. బిగ్ బాస్ లో స్నేహంగా కనిపించినవారు బయట మాత్రం కనీసం కలిసి కనిపించడమే లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో షణ్ముఖ్ తన గర్ల్ ఫ్రెండ్ ని దీప్తి సునాయనాని మరిచి సిరి తో మితిమీరిన స్నేహం చేసాడు. బయటికొచ్చేసరికి షణ్ముఖ్ కి గర్ల్ ఫ్రెండ్ దీప్తి షణ్ముఖ్ కి గుడ్ బాయ్ చెప్పింది. ఆ తర్వాత షణ్ముఖ్ సిరి మళ్ళీ కలిసి కనిపించలేదు. అంతేకాకుండా సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ తో గొడవైన మళ్ళీ అంతా సెటిల్ అయ్యింది.

ఇక గత సీజన్ లో శ్రీహన్ కూడా శ్రీ సత్యతో క్లోజ్ ఫ్రెండ్ షిప్ చేసాడు. శ్రీ సత్య-శ్రీహన్ ని పలువురు అపార్ధం చేసుకున్నారు. సిరి హౌస్ లోకి వచ్చినప్పుడు శ్రీహన్ ని కాస్త వార్న్ కూడా చేసింది. ఇక శ్రీహన్ రన్నర్ గా బయటికొచ్చాక మళ్ళీ శ్రీసత్యని కలవలేదట. అసలు శ్రీసత్య ఫోన్ కూడా లిఫ్ట్ చెయ్యడమే లేదట. శ్రీ సత్య-శ్రీహన్ లు హౌస్ లో అంత ఫ్రెండ్ షిప్ ని మైంటైన్ చేసి బయటికొచ్చాక మళ్ళీ కలవకపోవడం విచిత్రమే, శ్రీ సత్య-శ్రీహన్ బయటికొచ్చాక రేవంత్ బర్త్ డే పార్టీలో మాత్రమే కలిశారట.

ఆ తర్వాత శ్రీహన్ తో శ్రీ సత్యకి కాంటాక్ట్స్ కూడా లేవట. అదే విషయం శ్రీ సత్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తాను జన్యున్ గానే ఉన్నానని, కానీ శ్రీహన్ మాత్రం తన ఫోన్ కాల్స్ కి కూడా రెస్పాండ్ అవడం లేదు, రెండుమూడుసార్లు నేను ఫోన్ చేస్తే సిరి ఎత్తింది అంటూ చెప్పగా.. ఎందుకో అడగలేదా అని యాంకర్ అడిగితే ఆ విషయం మీరే అడగండి నాకెందుకు అంటూ శ్రీ సత్య తప్పించుకుంది. మరి హౌస్ లో ఉన్న డీప్ ఫ్రెండ్ షిప్ లు హౌస్ బయట మాత్రం కనిపించడమే లేదు. 

Then Shanmukh-Siri, new Srihan-Sri Sathya:

Srihan vs Sri Sathya

Tags:   SRIHAN, SRI SATHYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ