గత నెల అంటే నవంబర్ 24న ఎన్నో అంచనాల నడుమ థియేటర్స్ లోకి వచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఆదికేశవ మూవీ అట్టర్ ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. శ్రీలీల క్రేజ్ కూడా ఏ మాత్రం కలిసిరాలేదు. ఆమె అందం, డాన్సులు అన్ని వృధా అయ్యాయి. ఇక ఉప్పెన తర్వాత సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్న వైష్ణవ్ కి ఆదికేశవ మరో షాకిచ్చింది. ఈ చిత్రాన్ని విడుదలకు ముందే ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకుంది.
ఈ చిత్రాన్ని నెల తిరిగేలోపులో ఓటీటీకి వచ్చేస్తుంది అనుకుంటే.. ఇప్పటివరకు ఆదికేశవ ఓటిటి డేట్ జాడ లేదు. అయితే తాజాగా ఆదికేశవ ఈనెల 22 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ ఆదికేశవ డిసెంబర్ 22 నుంచి నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ అవడం గ్యారెంటీ అని తెలుస్తోంది.