నయనతార టాప్ హీరోయిన్ గా అటు కెరీర్ ని ఇటు పర్సనల్ లైఫ్ లో భర్త, ఇద్దరు కొడుకులతో చాలా సంతోషంగా కనిపిస్తుంది. నయనతార హ్యాపీనే. కానీ ఆమె భర్త విగ్నేష్ మాత్రం కెరీర్ లో స్ట్రగుల్ అవుతున్నాడు. నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకుడిగా అజిత్ తో మూవీ అనౌన్స్ చేసాక అది ఆగిపోయింది. అజిత్ తప్పుకున్నాక విగ్నేష్ శివన్ మళ్ళీ చాలా రోజుల తర్వాత లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాధన్ తో విగ్నేష్ శివన్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు.
ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి ఎల్ ఐ సి అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఎల్ ఐ సి అంటే లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అన్నమాట. ఈ చిత్రానికి సంబందించిన పూజా కార్యక్రమాలు రీసెంట్ గానే నిర్వహించారు, దీని కోసం నయనతార భర్త తో కలిసి స్పెషల్ గా పూజలు చేరిన పిక్స్ వైరల్ గా మారాయి. రెడ్ కలర్ శారీలో నయనతార చాలా భక్తితో కనిపించగా విగ్నేష్ శివన్ ఎల్లో అవుట్ ఫిట్ లో పూజలు చేసారు.
ఇలా పూజలు చేస్తున్న నయనతార-విగ్నేష్ శివన్ ల జంటని చూసినవారంతా సో క్యూట్, లవ్లీ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.