అనసూయ భరద్వాజ్ ఈమధ్యన సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టీవ్ అయ్యింది. తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంటుంది. కానీ ఈ రేంజ్ యాక్టీవ్ గా ఉండడం ఇదే మొదటిసారి. అనసూయ వెండితెర మీద పలు సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండడమే కాదు.. షాప్ ఓపెనింగ్స్ లో రిబ్బన్ కటింగ్స్ అంటూ హడావిడి చేస్తుంది. కొన్నాళ్లుగా అనసూయ గ్లామర్ షో కన్నా ఎక్కువగా పట్టు చీరల ఫోటో షూట్స్ తో అందంగా తయారవుతోంది. కాంజీవరం పట్టు చీరలని ప్రమోట్ చేస్తుందా అనేలా ఆమె షూట్స్ ఉంటున్నాయి.
రోజుకో పట్టు చీరలో అనసూయ మెరిసిపోతుంది. మంచి మంచి కలర్స్ ఉన్న పట్టు చీరల్లో అనసూయ చాలా స్టయిల్ గా హొయలు పోతూ చేయించుకున్న ఫోటో షూట్స్ చూస్తే అనసూయ అస్సలు తగ్గడం లేదుగా అంటారు. భర్త తో కలిసి ఆమె జిమ్ కి వెళుతూ కష్టపడి వర్కౌట్స్ చేస్తున్న అనసూయ లో కాస్త భారితనం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అనసూయ బరువు పెరిగినా ఆమె హైట్ అడ్వాంటేజ్. అందుకే ఆమె బరువు కనిపించదు.
ఇక ప్రస్తుతం అనసూయ సినిమాలకన్నా ఎక్కువగా సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో హైలెట్ అవుతుంది... మీరూ అనసూయ పట్టు శారీస్ ఫొటోస్ ని ఓ లుక్కెయ్యండి.