2024 లో జరగబోయే ఎన్నికలకోసం వైస్సార్సీపీ పార్టీ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టడమే కాదు, దానికోసం సన్నద్ధం అవుతుంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గం ఇన్ ఛార్జుల మార్పు ఇప్పుడు ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు అన్ని ఎన్నికల టార్గెట్ లా అనిపించకమానవు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
జనవరి నుంచి సామాజిక పెన్షన్లు రూ.2,750 నుంచి రూ.3,000కు పెంపు
ఆరోగ్య శ్రీలో చికిత్స పరిమితి రూ.25 లక్షలకు పెంపు
జనవరిలో వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాల అమలు
విశాఖలో లైట్ మెట్రో ప్రాజెక్ట్ DPRకు ఆమోదం
జనవరి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత ప్రారంభం
కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలు ఇవన్నీ ప్రజలను మళ్ళీ తమకే ఓటు వెయ్యాలని అడగకనే అడిగినట్లుగా అనిపిస్తుంది. మరి ఈసారి ఎన్నికల్లో YSRCP కి ఈ పథకాలు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి.