సోషల్ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చాక నిజాలు నిర్భయంగా మాట్లాడుతున్న హీరోల అభిమానులు ఒక్కోసారి మితిమీరిపోతున్నారు. తమ హీరో విషయంలో ఏదైనా నెగెటివ్ గా కనిపిస్తే చాలు ఆ విషయంలో చెలరేగిపోయి బూతులు తిట్టేస్తున్నారు. ప్రతి ఒక్క హీరో అభిమానులు అలానే ఉన్నారు. తమ హీరోల సినిమాల అప్ డేట్స్ ఇవ్వకపోతే నిర్మాణ సంస్థల్ని టార్గెట్ చెయ్యడం ఇలా ఏ విషయంలో అయినా ఫాన్స్ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి.
అయితే నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ దానిని తప్పు అనడం కరెక్ట్ కాదు కదా. థమన్ అలా వైకుంఠపురములో మ్యూజిక్ ఆల్బమ్ చేసినప్పుడు ఆహా ఓహో అన్నవారే ఈరోజు గుంటూరు కారం సాంగ్స్ విన్నప్పుడల్లా థమన్ ని తిట్టిపోస్తున్నారు. ఆఖరికి పాటలు రాసిన శాస్త్రిగారినీ వదలడం లేదు. రామజోగయ్యా శాస్త్రి లిరిక్స్ ని ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
దానితో చిర్రెత్తుకొచ్చిన రామజోగయ్య గారు మహేష్ అభిమానులని కుక్కలు అంటూ సంబోధిస్తూ చేసిన ట్వీట్ చూసిన వారు మరింతగా రెచ్చిపోయి శాస్త్రిగారిని టార్గెట్ చేసారు. గుంటూరు కారం పాటలు ఇలా రాసావ్, అలా రాసావ్ అంటూ ఆడుకుంటున్నారు. దానితో రామజోగయ్యకి మరింతగా కాలింది. సోషల్ మీడియా వేదికగా మహేష్ అభిమానులతో పెట్టుకున్నారు ఆయన. వాళ్ళు ఊరుకుంటారా. అస్సలు తగ్గడం లేదు. బావుంది అంటే బావుంది, బాలేదు అంటే బాలేదు అని చెప్పే హక్కు మాకు లేదా అంటూ వారు రెచ్చిపోతున్నారు.
మరి రామజోగయ్యాయ్ శాస్త్రి గారి ఇలా ఎంతమందితో పోరాడతారు. సినిమా విడుదలయ్యేసరికి మరిన్ని నెగెటివ్ కామెంట్స్ ఫేస్ చెయ్యాల్సి వస్తుంది అప్పుడేం చేస్తారు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.