ఇప్పటివరకు హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన బర్త్ డే వేడుకలని ఫ్రెండ్స్ తోనో, లేదంటే ఫ్యామిలితోనో జరుపుకుని ఉంటుంది. గత ఏడాది కూడా లావణ్య త్రిపాఠి డెహ్రాడూన్ లో ఉంటే.. వరుణ్ తేజ్ అక్కడికి వెళ్లి తన బర్త్ డే వేడుకల్లో పాల్గొనడమే కాకుండా ఓ రింగ్ కూడా ప్రెజెంట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. మరి వరుణ్-లావణ్య లు ప్రేమించుకుని ఫైనల్ గా ఈఏడాది నవంబర్ 1 న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన వెంటనే హడావిడిగా హనీమూన్ అంటూ ఎగిరిపోకుండా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు ఈ నెల మొదటి వారంలో హనీమూన్ కి వెళ్లారు.
ఈరోజు డిసెంబర్ 15 లావణ్య త్రిపాఠి పుట్టిన రోజు. మరి పెళ్లి తర్వాత మొదటి బర్త్ డే ని లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలిలో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటుంది అనుకుంటే.. భర్త తో పాటుగా హనీమూన్ లో తన బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకుంటుంది. వరుణ్-లావణ్య లు ఇంకా వెకేషన్ లోనే ఉన్నారు. అక్కడే లావణ్య తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోతుంది. పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్ డే ని లావణ్య ఎంత మెమొరబుల్ గా మార్చుకోబోతుందో అని ఆమె అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.