Advertisementt

BB7: మిడ్ వీక్ ఎలిమినేషన్ లేనట్లే

Fri 15th Dec 2023 10:20 AM
bigg boss 7 telugu  BB7: మిడ్ వీక్ ఎలిమినేషన్ లేనట్లే
Bigg Boss Telugu 7 Elimination Update BB7: మిడ్ వీక్ ఎలిమినేషన్ లేనట్లే
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7లో గ్రాండ్ ఫినాలే వీక్ కోసం ఐదుగురు మిగులుతారు, టాప్ 5 లో ఎవరెవరు ఉంటారో అనుకుంటే... టాప్ 5 కాదు ఉల్టా పూల్టాలో భాగంగా టాప్ 6 అంటూ నాగార్జున గత ఆదివారం ఎనౌన్స్ చేసి మరీ శోభా శెట్టిని ఎలిమినేట్ చేసారు. ఈ టాప్ 6 లో పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్, అర్జున్ అంబటి, యావర్, ప్రియాంకలు ఉన్నారు. అయితే కొద్దిరోజులుగా టాప్ 6 నుండి ఓ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. అందులో ఎవరో ఒకరు ముఖ్యంగా యావర్ కానీ అమర్ కానీ ఎలిమినేట్ అవుతారంటూ ప్రచారం జరిగింది.

అయితే ఈ సీజన్ టాప్ లోకి ఆరుగురు ఎంటర్ అయ్యారు. గ్రాండ్ ఫినాలే వీక్ ఎపిపోడ్ వరకు ఆరుగురు ఉంటారు. ఈ ఆరుగురిలో ఎవరూ మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటికి వెళ్ళరు. గురువారం కూడా పూర్తయ్యింది. అటు 24 / 7 లైవ్ కూడా ఆపేసారు. అంటే బిగ్ బాస్ హౌస్ లో అప్పుడే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం అన్నీ రెడీ అవుతున్నాయి. సో ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లేకుండా ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్ ఫినాలే ఎపిసోడ్ కి వెళ్లిపోయారని అంటున్నారు.

మరి గత సీజన్ లో రేవంత్ విన్నర్ గా నిలబడగా ఇప్పుడు టాప్ 6లో ఉన్నవారిలో ఎవరు విన్నర్ అవుతారో అనేది బుల్లితెర ప్రేక్షకులకి ఎప్పుడో ఓ ఐడియా వచ్చేసింది. పల్లవి ప్రశాంత్ విన్నర్, శివాజీ రన్నర్ గా ఉంటారని అందరూ ఎప్పుడో ఓ అంచనాకి వచ్చేసారు.

Bigg Boss Telugu 7 Elimination Update:

Bigg Boss 7 Telugu Mid Week Elimination

Tags:   BIGG BOSS 7 TELUGU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ