Advertisementt

ఇకపై విజయ్ దేవరకొండ బిజీ బిజీ

Fri 15th Dec 2023 10:11 AM
vijay devarakonda  ఇకపై విజయ్ దేవరకొండ బిజీ బిజీ
Now Vijay Devarakonda is busy ఇకపై విజయ్ దేవరకొండ బిజీ బిజీ
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సంక్రాంతి కి వస్తుంది వస్తుంది అని ఊరించి ఇప్పుడు దానిని మార్చ్ కి షిఫ్ట్ చేసారు. దానితో విజయ్ దేవరకొండ రిలాక్స్ అయ్యి కూల్ గా లేడు. ఐరెనే వంచాలా అంటూ USA లో ఫ్యామిలీ స్టార్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. జనవరి చివరి వారానికల్లా ఫ్యామిలీ స్టార్ షూటింగ్ ఫినిష్ చేసేసి.. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తదుపరి VD13 మూవీ గౌతమ్ తిన్ననూరి సెట్స్ లోకి వెళ్ళిపోతాడట. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ చేస్తున్న విజయ్ ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ తో జత కడుతున్నాడు.

ఇక గౌతమ్ తిన్ననూరి మూవీలో విజయ్ దేవరకొండ శ్రీలీల తో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటివారం నుంచి కొలంబియాలో మొదటి షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఫ్యామిలీ స్టార్ ఫినిష్ కాగానే చిన్నపాటి గ్యాప్ కూడా లేకుండా విజయ్ గౌతమ్ తిన్ననూరి షూటింగ్ లో జాయిన్ అవుతాడు. అంటే ఇకపై విజయ్ దేవరకొండ బిజిబిజినే అన్నమాట. గౌతమ్ తిన్ననూరితో మొదటి షెడ్యూల్ ఫినిష్ కాగానే ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ కి వచ్చేస్తాడట విజయ్. 

Now Vijay Devarakonda is busy:

Vijay Devarakonda movie updates

Tags:   VIJAY DEVARAKONDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ