సలార్ ప్రమోషన్స్ కి ప్రభాస్ సహకరించడం లేదా? ఇప్పుడు ఇదే ప్రశ్న ప్యాన్ ఇండియా ప్రేక్షకుల మదిలో మెదులుతుంది. ఎందుకంటే KGF 2 ప్రమోషన్స్ అప్పుడు హోంబేలె ఫిలిమ్స్ వారు దేశం మొత్తం తిరుగుతూ తెగ హడావిడి చేసారు. కానీ సలార్ విషయం వచ్చేసరికి వారు అంత కామ్ గా ఉండడం చాలామందికి షాకిస్తుంది. సలార్ మేకర్స్ అంతగా సైలెంట్ అవ్వడానికి కారణం ప్రభాస్ కాదు గదా అనే అనుమానం చాలామందిని తొలిచేస్తోంది. ప్రభాస్ బాహుబలి తర్వాత తన సినిమా ప్రమోషన్స్ విషయంలో చాలా లైట్ గా ఉంటున్నాడు.
సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా మూడు సినిమాలకి ఒక్కో ప్రీ రిలీజ్ ఈవెంట్ చొప్పున నిర్వహించేసి చేతులు దులిపేసుకున్నారు. సాహో అప్పుడు ముంబైలో కొద్దిగా హడావిడి చేసినా రాధేశ్యామ్, ఆదిపురుష్ విషయంలో ప్రభాస్ చేసింది ఆయన ఫాన్స్ కే నచ్చలేదు. ఇక ఇప్పుడు సలార్ విషయంలోనూ ప్రభాస్ మేకర్స్ కి సరిగ్గా సహకరించడం లేదనే టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ మోకాలి ఆపరేషన్ చేయించుకుని రెస్ట్ తీసుకుని కల్కి సెట్స్ లోకి వెళ్ళిపోయాడు.
అలాగే ప్రభాస్ మీడియా ముందుకు రావడానికి ఇష్టపడని కారణంగానే సలార్ మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో కామ్ అయ్యారు అంటున్నారు. ఏదో రాజమౌళి తో ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీ రాజ్ ల కామన్ ఇంటర్వ్యూ ఒకటి ప్లాన్ చేస్తున్నారనే మాట వినిపిస్తున్నా ఇంకా ఎప్పుడు అది అనే అనుమానం కలుగుతుంది. సలార్ విడుదలకి ఇంకా ఆరు రోజుల సమయం మత్రమే ఉంది. చూద్దాం ఈ వారంలో ఏం అద్భుతాలు జరుగుతాయో అనేది.