Advertisementt

నిజమేనా రోజా ఇది!

Thu 14th Dec 2023 11:55 AM
jagan,roja  నిజమేనా రోజా ఇది!
Jagan Rejected MLA Ticket To Roja? నిజమేనా రోజా ఇది!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఫైర్ బ్రాండ్ రోజా కి నగరి టికెట్ ఇవ్వడం లేదు, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అందుకే టికెట్ ఇవ్వలేకపోతున్నామని పార్టీ అధిష్టానం రోజాకి చెప్పినట్టుగా సోషల్ మీడియా మొత్తం స్ప్రెడ్ అయ్యింది. దానితో రోజా వీడియోస్, ఫొటోస్ పెట్టి ఆమె యాంటీ ఫాన్స్ పండగ చేసుకుంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి టీడీపీ నుంచి వైసీపీ లోకి వచ్ఛాక ఫైర్ బ్రాండ్ లా టీడీపీపై చంద్రబాబు, లోకేష్ లని టార్గెట్ చేస్తూ విరుచుకుపడిపోయే రోజా మంత్రి పదవి వచ్చాక నగరిలో తిరుగుతూ కనిపిస్తుంది.

అయితే మంత్రి పదవి రాకముందే రోజా పార్టీలో యాక్టీవ్ గా ఉంది. మంత్రి పదవి వచ్చాక ఆటలు ఆడుకుంటూ గుడులు గోపురాలు తిరుగుతుంది అనే అపవాదు మూటగట్టుకుంది. ఇక 2024 ఎన్నికల్లో రోజాని నగరి బరి నుంచి తప్పించారు, ఆమె గ్రాఫ్ తగ్గడంతోనే రోజాకి జగన్ టికెట్ ఇవ్వడం లేదు, అలాగని రోజాకి అన్యాయం చెయ్యరు, ఆమెకి సముచిత స్థానం కల్పిస్తారంటూ హంగామా జరుగుతుంది. మరి టికెట్ ఇవ్వకపోతే రోజా ఊరుకుంటుందా.. ఆమె అభిమానులు ఒప్పుకుంటారా.. 

ఒకవేళ వైసీపీ నుంచి టికెట్ రాకపోతే రోజా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది. అప్పుడు కూడా జగన్ భజన చేసుకుంటుందా? లేదంటే ఎదురు తిరుగుతుందా? అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మరి నిజంగానే జగన్ రోజాకి టికెట్ ఇవ్వరా అనేది ఇప్పడూ హాట్ హాట్ గా జరుగుతున్న ప్రచారం.

Jagan Rejected MLA Ticket To Roja?:

AP - Jagan Rejected MLA Ticket To Roja?

Tags:   JAGAN, ROJA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ