Advertisementt

బిగ్ బాస్ 7 ఫినాలేకి గెస్ట్ గా స్టార్ హీరో

Wed 13th Dec 2023 09:36 PM
mahesh babu  బిగ్ బాస్ 7 ఫినాలేకి గెస్ట్ గా స్టార్ హీరో
Bigg Boss 7 finale guest star hero బిగ్ బాస్ 7 ఫినాలేకి గెస్ట్ గా స్టార్ హీరో
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 మరో నాలుగు రోజుల్లో ముగియబోతుంది. ఈ ఆదివారం అంటే డిసెంబర్ 17 సాయంత్రం 6 గంటల నుంచి సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మొదలు కాబోతుంది. అయితే కొన్ని సీజన్స్ కి మెగాస్టార్ చిరు, వెంకీలు గెస్ట్ లుగా వచ్చారు. ఆతర్వాత నాగార్జునే విన్నర్ కి ట్రోఫీ తో పాటుగా ప్రైజ్ మనీ ఇస్తూ వస్తున్నారు. అయితే ఈ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి ఊహించని గెస్ట్ రాబోతున్నారట. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే కి అతిధి అంటూ ప్రచారం షురూ అయ్యింది.

అయితే నాగార్జున మహేష్ ని కలిసి స్వయంగా బిగ్ బాస్ కి రావాల్సిందిగా ఆహ్వానించారనే న్యూస్ కూడా మొదలయ్యింది. మాములుగా మహేష్  ఇలాంటి షోస్ కి చాలా అరుదుగా వస్తాడు. ఇప్పుడు నిజంగా బిగ్ బాస్ షో కి గెస్ట్ గా మహేష్ రావడం అంటే ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి క్రేజ్ మాములుగా ఉండదు. మహేష్ చేతుల మీదుగా ఈ సీజన్ కప్ ఎవరు అందుకుంటారో అనే క్యూరియాసిటీ అప్పుడే బుల్లితెర ప్రేక్షకుల్లో మొదలైపోయింది. 

అయితే మహేష్ బాబు బిగ్ బాస్ గెస్ట్ గా రాబోతున్నాడనేది కేవలం రూమర్ గా చాలామంది కొట్టిపారేస్తున్నారు. మహేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ షోకి రాడు.. ఇది కావాలనే షో పై క్రేజ్ పెంచడానికే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో అనేది.

Bigg Boss 7 finale guest star hero:

Interesting: Superstar guest for Bigg Boss 7 finale

Tags:   MAHESH BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ