హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ని గ్రాండ్ గా ప్రకటించడం, పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చినప్పుడల్లా షూటింగ్ చేస్తూ వస్తోన్న హరీష్ శంకర్ ని పవన్ కళ్యాణ్ పదే పదే ఇబ్బంది పెడుతున్నారు. అంటే వేరే వాళ్ళకి డేట్స్ ఇచ్చి హరీష్ కి అన్యాయం చెయ్యడం కాదు, పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా పర్ఫెక్ట్ గా డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. దానితో హరీష్ శంకర్ పది రోజులు పని చేస్తే నెలలు నెలలు ఖాళీగా ఉంటున్నాడు. మధ్యలో యాడ్ షూట్స్ అవి చేసుకుంటున్నాడు అది వేరే విషయం.
అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది పరిస్థితి. హరీష్ శంకర్ ఇకపై పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూసి టైమ్ వెస్ట్ చేసుకోదలుచుకోలేదు. అందుకే ఇప్పుడు హరీష్ తెలివిగా అడుగులు వేస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ ని పక్కనబెట్టి హరీష్ శంకర్ రవితేజతో సినిమా మొదలు పెట్టేందుకు సిద్దమయ్యాడు. అప్పుడెప్పుడో సోషల్ మీడియాలో హరీష్ శంకర్ రవితేజతో మూవీ ఉంటుంది, అది జనవరి నుంచి ఉండే అవకాశముంది అని ఎవరో అంటే హరీష్ ఒంటి కాలిమీద లేచాడు.
మరి ఇప్పుడు రవితేజ తో హరీష్ శంకర్ మూవీ గురించి అఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చేసింది. గతంలో మిరపకాయ్ తో హిట్ అందుకున్న హరీష్-రవితేజ కలిస్తే మరో బ్లాక్ బస్టర్ ఖాయమని అంటున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోతున్నట్టుగా ప్రకటించారు.