దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేష్ ఇలా ఎవ్వరూ తమ తమ భార్యలని, పిల్లలని పబ్లిక్ కి పెద్దగా చూపించారు. చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తారు. వెంకీ భార్య అయితే చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆయన కుమార్తె పెళ్ళిలో వెంకీ భార్య ఫ్యామిలీ పిక్ లో కనిపించారు. అయితే దగ్గుబాటి రానా వివాహం కరోనా సమయంలో జరగడంతో అప్పుడు వాళ్ళ పెళ్లి ఫొటోస్ మాత్రమే బయటికి వచ్చాయి. తాజాగా రానా తమ్ముడు హీరో అభిరామ్ వివాహం ప్రత్యూషతో శ్రీలంక వేదికగా జరిగిపోయింది.
అభిరామ్, వెంకటేష్, సురేష్ బాబు ఇలా అందరూ ఎయిర్ పోర్ట్ లో కనిపించినా వీరి భార్యలు మాత్రం కనిపించలేదు. పెళ్లి తర్వాత అభిరామ్ వెడ్డింగ్ పిక్ బయటికొచ్చినా అందులో సురేష్ బాబు ఆయన వైఫ్ మాత్రమే ఉన్నారు అయితే నిన్న మంగళవారం సాయంత్రం అభిరామ్ పెళ్లి ఫోటో అది కూడా దగ్గుబాటి ఫ్యామిలీ పిక్ బయటికొచ్చింది. అందులో రామానాయుడు భార్య, సురేష్ బాబు ఆయన భార్య, వెంకీ ఆయన భార్య, రానా ఆయన భార్య మెహిక, నాగ చైతన్య, వెంకీ కుమర్తెలు అందరూ కనిపించారు.
కొత్త జంట అభిరామ్-ప్రత్యూషలతో పాటుగా దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం ఒకే ఫ్రెమ్ లో కనిపించడంతో అభిమానులు చాలా సర్ ప్రైజ్ అయ్యారు. త్వరలో హైదరాబాద్‌లో అభిరామ్, ప్రత్యూష రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్ కి దగ్గుబాటి కుటుంబానికి సన్నిహితులు బంధుమిత్రులంతా విచ్చేస్తారని సమాచారం. ప్రస్తుతం దగ్గుబాటి ఫ్యామిలీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.