చిన్నవయసులోనే హీరోయిన్ గా టాలీవుడ్ యంగ్ హీరోలని చుట్టేసిన శ్రీలీల నిన్నటివరకు లక్కీనే. ఆమె ఆఫర్స్ చూసి శ్రీలీల టాప్ 1 చైర్ లో కూర్చుంటుంది అని భావించారు. ఆమె హీరోలని చూసింది కానీ, దర్శకులు ఆమె పాత్రని ఎలా డిజైన్ చేసారో అనేది అంచనా వేయలేకపోయింది. ఫలితం నెలకో డిసాస్టర్ ఆమె ఖాతాలోకి వచ్చిపడ్డాయి. రామ్, నితిన్, వైష్ణవ తేజ్, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అబ్బో పాప కి అన్నీ లక్కీ ఛాన్స్ లే. అందమైన హీరోలే తగిలారు.
కానీ శ్రీలీల పాత్రల విషయంలో దర్శకులు చేసిన మోసానికి బలైపోయింది. ధమాకా క్రేజ్ తో ఆఫర్స్ ఇచ్చారు కానీ.. ఆమె డాన్స్ లని, పాత్రని లైట్ తీసుకోవడంతో శ్రీలీల లక్కీ కాస్తా ఐరెన్ లెగ్ అయ్యి కూర్చుంది. వరసగా మూడు భారీ డిజాస్టర్స్. స్కంద, ఆదికేశవ, ఎక్సట్రార్డినరీ మ్యాన్ మూవీస్ ప్లాప్ లతో పాప ఢీలా పడిపోయింది. గత నాలుగు నెలలుగా షూటింగ్స్, ప్రమోషన్స్ అంటూ పరుగులు పెట్టింది. కానీ సక్సెస్ ని అందుకోలేకపోతుంది.
మరి శ్రీలీలని గురూజీ అయినా కాపాడతారా.. గురూజీ అదేనండి త్రివిక్రమ్ గారు, ఆయన సినిమాల్లో హీరోయిన్స్ కి అధిక ప్రాధాన్యత ఉంటుంది. మరి గుంటూరు కారంలో పాపని అందంగా చూపించడంతో పాటుగా.. మంచి కేరెక్టర్ వేస్తె ఓకె.. లేదంటే శ్రీలీల పని గుంటూరు కారంతో ఎండ్ అవడం గ్యారెంటీ. మహేష్ బాబు తో అంటే మాటలా.. అలాగని చిన్న పాత్ర ఇస్తే శ్రీలీల అన్యాయం అయ్యిపోతుంది. చూద్దాం సంక్రాంతికి వరకు వెయిట్ చేస్తే అసలు విషయం తెలిపోతుంది.