తమ్ముడు తారక్ తో దేవర మూవీని నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు తన సినిమా డెవిల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇవ్వడమే కాదు.. దేవర పై అంచనాలు అమాంతం పెంచేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీ టీజర్ జనవరి 1 న్యూ ఇయర్ సందర్భంగా వదలబోతున్నారనే ప్రచారానికి కళ్యాణ్ రామ్ ఆన్సర్ ఇచ్చారు.
కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. తమ్ముడు ఎన్టీఆర్ సినిమా దేవర గురించి చెప్పాలంటే.. RRR వంటి సినిమా చేసిన తర్వాత ఓ యాక్టర్‌కి, ఓ డైరెక్టర్‌కి, ప్రొడక్షన్ హౌస్‌కి గాని ఎంతో బాధ్యత ఉంటుంది. చిన్నపాటి తప్పు జరిగినా ఎవరూ ఊరుకోరు. మేం తెలిసి తప్పు చేయం. బాధ్యతగా తీసుకుని ఎంత కష్టపడతామో మాకు తెలుసు. రేపు థియేటర్స్‌లో సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటాం.
త్వరలోనే దేవర గ్లింప్స్ రాబోతుంది. దానికి కావాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి. వి.ఎఫ్.ఎక్స్‌కి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మేం దేవర మూవీ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం. దయచేసి ఓపిక పట్టండి. త్వరలోనే గ్లింప్స్ డేట్‌ను టీమ్ అనౌన్స్ చేస్తుంది.. అంటూ కళ్యాణ్ రామ్ డెవిల్ ట్రైలర్ లాంచ్ లో దేవర పై ఇచ్చిన అప్ డేట్ తో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.