Advertisementt

పవన్ ఫ్యాన్స్ కి OG మేకర్స్ బ్యాడ్ న్యూస్

Tue 12th Dec 2023 04:11 PM
og,pawan kalyan  పవన్ ఫ్యాన్స్ కి OG మేకర్స్ బ్యాడ్ న్యూస్
OG makers bad news for Pawan fans పవన్ ఫ్యాన్స్ కి OG మేకర్స్ బ్యాడ్ న్యూస్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ సుజిత్ తో OG ని అనౌన్స్ చేసినప్పటినుంచి ఆయనకి వీలున్నప్పుడల్లా ఆ సినిమా కోసం డేట్స్ కేటాయిస్తూ వచ్చారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న OG షూటింగ్ ని షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ ని సుజిత్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చాడు. ముంబైగా, పూణే, హైదరాబాద్ లలో చక చకా పూర్తి చేసేసాడు. అదే స్పీడులో OG ని ఎలాగైనా ఈ నెల అంటే డిసెంబర్ లోనే విడుదల చెయ్యాలని మేకర్స్ గట్టిగా డిసైడ్ అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ దొరక్క ఇప్పుడు దానిని పోస్ట్ పోన్ చేసుకున్నారు.

ఎలాగైనా మార్చ్ లో ఏపీ ఎలక్షన్స్ కన్నా ముందే OG విడుదల అని నిర్మాత దానయ్య చెప్పారు. అంతేకాదు.. OG కి సంబందించిన ప్రతి చిన్న అప్ డేట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ వచ్చారు. కొద్దిరోజుల క్రితం OG టీజర్ పై కూడా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు OG మేకర్స్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని డిస్పాయింట్ చేస్తూ ఇచ్చిన అప్ డేట్ తో పవన్ ఫాన్స్ ఢీలాపడిపోతున్నారు.

ఫాన్స్ ఎప్పుడు తమ హీరో అప్ డేట్స్ కొసం ఆకలిగానే ఉంటారు. అయితే వారందరికీ ఇప్పుడు తాము చెప్పేది ఏమిటంటే. ప్రస్తుతం తాము ఎలాంటి షూటింగ్ చేయడం లేదు. అందుకే ఇప్పట్లో OG అప్డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. సోషల్ మీడియాలో OG అప్ డేట్స్ కోసం ఎవరు ఆశించవద్దు అంటూ చేసిన ట్వీట్ చూసి పవన్ ఫాన్స్ నీరసించిపోయారు. మరి పవన్ కళ్యాణ్ ఏపీ ఎలక్షన్స్ పూర్తయ్యేవరకు ఏ సినిమా సెట్స్ లో కనిపించేలా లేరు. అందుకే దానయ్య -సుజిత్ వాళ్ళు కూడా OG ని ఆపెసుకుని కూర్చున్నారు అని తెలుస్తోంది. 

OG makers bad news for Pawan fans:

Pawan Kalyan OG update 

Tags:   OG, PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ