కోలీవుడ్ లో ప్రస్తుతం త్రిష యంగ్ హీరోయిన్స్ కి పోటీగా తయారైంది. పొన్నియన్ సెల్వన్ తర్వాత త్రిష క్రేజ్ బాగా పెరిగిపోయింది. కోలీవుడ్ లో ప్రస్తుతం త్రిష డిమాండ్ ఎక్కువయ్యింది. కోలీవుడ్ లో అజిత్, కమల్ హాసన్ ఇలా పెద్ద స్టార్ అందరితో జోడి కడుతుంది. ఇప్పుడు టాలీవుడ్ నుంచి త్రిష కి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చిపడుతున్నాయనే న్యూస్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం త్రిష కున్న క్రేజ్ వలన ఆమెని టాలీవుడ్ సీనియర్ హీరోలు సంప్రదిస్తున్నారట.
అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి-వసిష్ఠ మూవీ విశ్వంభర లో మెయిన్ హీరోయిన్ కోసం త్రిషని సంప్రదించారని తెలుస్తోంది. త్రిష కూడా తన పాత్రకున్న ప్రాధాన్యతను బట్టి ఈ ఆఫర్ ని ఒప్పుకుంది అనే టాక్ మొదలయ్యింది. మరి చిరంజీవి సినిమాతో పాటుగా.. నాగార్జున నెక్స్ట్ మూవీ కోసం కూడా త్రిషని అనుకుంటున్నారని వినికిడి. ప్రస్తుతం నాగార్జున నా సామిరంగా మూవీతో సంక్రాంతికి రాబోతున్నారు.
ఆ సినిమా తర్వాత నాగార్జున చెయ్యబోయే చిత్రంలో త్రిషనే హీరోయిన్ అంటున్నారు. త్రిష డేట్స్ కేటాయించాల్సి ఉందట. ఈ నెల 20 నుండి విశ్వంభర మరో షెడ్యుల్ మొదలు కానుంది. సంక్రాంతి పండుగ తర్వాత చిరు షూటింగ్ లో జాయిన్ అవుతారని సమాచారం. చిరు విశ్వంభర మూవీలో త్రిష హీరోయిన్ అనే విషయం త్వరలోనే అధికారిక ప్రకటన ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.