Advertisementt

పదిరోజుల్లో సలార్ నుంచి రాబోయేవి అవేనా?

Tue 12th Dec 2023 11:27 AM
salaar  పదిరోజుల్లో సలార్ నుంచి రాబోయేవి అవేనా?
Salaar: Will Silence Backfire? పదిరోజుల్లో సలార్ నుంచి రాబోయేవి అవేనా?
Advertisement
Ads by CJ

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ డిసెంబర్ 22 న విడుదలకు సిద్దమవుతుంది. అంటే మరో పది రోజుల్లో సలార్ ఆగమననానికి రెడీ అవుతుంది. కానీ హోంబోలే ఫిలిమ్స్ వారు సలార్ ప్రమోషన్స్ ని పిచ్చ లైట్ తీసుకుంటున్నారు. డిసెంబర్ 1 న సలార్ ట్రైలర్ వదిలారు. అంతే చేతులు దులిపేసుకున్నారు. సలార్ ట్రైలర్ కి భీబత్సమైన హైప్ వచ్చేసింది.. ఇకపై ప్రమోషన్స్ అక్కర్లేదు అనుకుందామనుకుంటే సలార్ ట్రైలర్ పై కామెడీ ట్రోల్స్ సోషల్ మీడియాలో కనిపించాయి.

ఇక సలార్ నుంచి సెకండ్ ట్రైలర్ రాబోతుంది.. అది కూడా యాక్షన్ ట్రైలర్ అంటూ ప్రచారం జరిగినా.. ఇంతవరకు దాని జాడ లేదు, మరోపక్క సలార్ లో ఉన్న రెండు పాటలు వదలబోతున్నారన్నారు. అది కూడా లేదు. ఇప్పుడు మేకర్స్ సలార్ పాటలను, రెండో ట్రైలర్ ని వదిలేందుకు డిస్కర్షన్ చేస్తున్నారట. ముఖ్యంగా ఈ పది రోజుల్లో రెండో ట్రైలర్ వదలాలని, దాని మీదే ఫోకస్ పెట్టారట. ఇక మెయిన్ నటులతో ఓ కామన్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసి ఇప్పుడు దానిని కూడా విరమించుకున్నారట.

ఎందుకంటే ఐదు భాషల్లో విడుదలయ్యే సలార్ కి ఒక్క భాషలో కామన్ ఇంటర్వ్యూ ఒక్క భాషతో సరిపోదు అని మేకర్స్ అది కూడా మానేశారట. మరి ఈపది రోజుల్లో సలార్ ప్రమోషన్స్ ఎక్కడ, ఎలా ఉండబోతున్నాయో తెలియక ఫాన్స్ సతమతమైపోతున్నారు. 

Salaar: Will Silence Backfire?:

Salaar makers in silent mode

Tags:   SALAAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ