Advertisementt

ఈ వారం వీటితో సరిపెట్టుకోండి

Tue 12th Dec 2023 11:03 AM
movies  ఈ వారం వీటితో సరిపెట్టుకోండి
Movies in Theatres this Week ఈ వారం వీటితో సరిపెట్టుకోండి
Advertisement
Ads by CJ

గత శుక్రవారం డిసెంబర్ మొదటివారమైన 7, 8 తేదీల్లో నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్సట్రార్డినరీ మూవీస్ థియేటర్స్ లో సందడి చేసాయి. రెండూ మీడియం బడ్జెట్ సినిమాలే అయినా.. ప్రేక్షకులని కాస్త థియేటర్స్ కి కదిలేలా చేసాయి. అకాల వర్షాల్లోనూ ఈ హీరోలిద్దరూ ధైర్యంగా బరిలోకి దిగారు. అయితే ఆ రెండు సినిమాల్లో హాయ్ నాన్నకి హిట్ టాక్ రాగా.. నితిన్ ఎక్సట్రార్డినరీ మూవీకి బ్యాడ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం థియేటర్స్ లో హాయ్ నాన్న సందడి కనిపిస్తుంది. 

ఇక ఈ వారం మాత్రం చిన్న సినిమాలతోనే ప్రేక్షకులు సరిపెట్టుకోవాల్సి ఉంది. డిసెంబర్ 15 న న చిన్న సినిమాలు వస్తున్నాయి. అందులో కొద్దో గొప్పో ప్రేక్షకుల్లోకి వెళ్లిన సినిమా జోరుగా హుషారుగా మూవీనే. బేబి చిత్రంలో నటించిన విరాజ్ ఈ చిత్రంలో హీరో కావడం, మేకర్స్ కూడా ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చెయ్యడంతో ఈ చిత్రం ప్రేక్షకులకి రీచ్ అవుతుంది. ఆ తర్వాత పిండం కూడా ఈ నెల 15 నే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ చిత్రం ప్రమోషన్స్ కూడా జోరుగానే కనిపిస్తున్నాయి.

ఇక మిగిలిన ఆలంబన, శాంతల చిత్రాలు టైటిల్ కూడా ప్రేక్షకులకు తెలియదు. మరి ఈ వారం ఈ చిన్నపాటి చిత్రాలతోనే ప్రేక్షకులు సరిపెట్టుకోవాలి. వీటితో పాటుగా మరికొన్ని చిత్రాలు ఓటిటీల నుంచి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి.

Movies in Theatres this Week:

List of Movies Releasing This Week

Tags:   MOVIES
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ