బిగ్ బాస్ సీజన్ 7 లో గ్రూప్ గేమ్ ఆడుతున్న సీరియల్ బ్యాచ్ అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంకలు మధ్య మధ్యలో వైరం పెట్టుకుని గొడవలు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంతగా గొడవలు పెట్టుకున్నా.. ముగ్గురు బడ్డీలుగానే టాస్క్ లు ఆడారు. అయితే ప్రియాంక తనకి హెల్ప్ చెయ్యలేదు అని అమర్ అలగడం, ప్రియాంకని టార్గెట్ చెయ్యడం జరిగింది. శోభని కెప్టెన్సీ చెయ్యడం కోసం అమర్ దీప్ తెగ ఆడేసాడు. ఆ తర్వాత శోభ శెట్టి అమర్ దీప్ కోసం ఆడుతూ తన ఆటని పక్కనబెట్టేసింది.
మధ్యలో అమర్ దీప్ ఫౌల్ గేమ్ లోను శోభా శెట్టి ఇరుక్కుంది. అమర్ వల్ల ప్రియాంక, శోభా శెట్టి చాలాసార్లు సఫర్ అయినా.. ఎక్కువగా అమర్ దీప్ ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. నాగార్జున కూడా శనివారం ఎపిసోడ్స్ లో ముగ్గురిని కలిపి గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటూ బయటపెట్టారు. ఇక ఈ వారం శోభ శెట్టి ఎలిమినేట్ అయ్యి బయటికొచ్చేసింది. అక్కడి నుంచి బయటికొచ్చేటప్పుడు తాను అర్జున్ అంబటిని, అమర్ దీప్ ని సపోర్ట్ చేస్తాను అని చెప్పింది.
బయటికొచ్చాక BB బజ్ లో గీతూ రాయల్ ఇంటర్వ్యూలో శోభా శెట్టి చాలా విషయాలను దాచేసింది. కానీ అమర్ దీప్ కి, అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నాను అంటున్నావ్ ఇదేంటి లాజిక్ అంది. అప్పడు శోభా నాకిష్టమైనది నేను సపోర్ట్ చేసుకుంటాను అంది. అప్పుడు అమర్ దీప్ ది ఓ వీడియో చూపించింది. అందులో అమర్ దీప్ శోభ శెట్టి బ్యాడ్ బిచ్చింగ్ చేస్తుంది అని ప్రియాంక తో మాట్లాడుతున్న వీడియో అది. అదే వీడియోలో శోభా శెట్టి స్వార్ధపరురాలు అంటూ అమర్ మాట్లాడడం చూసి శోభా శెట్టి షాకైంది.
అప్పుడు ఈ విషయంలో అమర్ దీప్ ఫోటోని పగలగుడుతూ అమర్ ఇలా అంటాడు అనుకోలేదు అంటూ శోభా శెట్టి మాట్లాడిన ఇంటర్వ్యూ స్టార్ మా BB బజ్ హైలెట్ అయ్యింది.