సలార్ విడుదలకు పట్టుమని పది రోజులు సమయం లేదు. ఈ పది రోజుల్లో సినిమాని ఏమైనా ప్రమోట్ చేస్తారా.. అసలు ప్యాన్ ఇండియాలో సినిమా విడుదల అంటే మేకర్స్ ఇంత నిమ్మకు నీరెత్తనట్టుగా ఉంటారా.. ఇప్పటికే మూడు సినిమాల విషయంలో మేకర్స్ చేసిన తప్పిదమే సలార్ మేకర్స్ కూడా చేస్తున్నారు. KGF 2 అప్పుడు సినిమాని తెగ ప్రమోట్ చేసిన హోంబులే ఫిలిమ్స్ వారు సలార్ ప్రమోషన్స్ ఇంతగా లైట్ తీసుకోవడం ప్రభాస్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది.
అసలే ట్రైలర్ పై బోలెడన్ని ట్రోల్స్, మీమ్స్, అయినా మేకర్స్ లో కదలిక లేదు. డిసెంబర్ 12 న మరో ట్రైలర్ అంటూ వార్తలొచ్చినా.. దానిలో నిజం లేదని తేలిపోయింది. సినిమా డిసెంబర్ 22 న విడుదల చేస్తున్నారు. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా ఉంటుందా.. ప్రభాస్ తన సినిమా షూటింగ్స్ చేసుకుంటున్నారు. సలార్ ప్రమోషన్స్ కోసం సమయం కేటాయించడం లేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలకు తగిన ప్రమోషన్స్ లేవు. అందుకే అవి ఫెయిల్ అయ్యాయి.
ఇప్పుడు సలార్ ని ఏ తీరానికి చేరుస్తారో, ప్రభాస్ నువ్వయినా పట్టించుకో.. దర్శకుడు ప్రశాంత్ నీల్ అడపాదడపా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కానీ అవి సరిపోవు, ఇప్పటివరకు సినిమాపై పూర్తి కిక్ ఇచ్చే మెటీరియల్ ఏదీ బయటికి రాలేదు. ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ని కలిసి ఒకే వేదికపై చూసేందుకు అభిమానులు ఆరాటపడిపోతున్నారు. కానీ సలార్ ఈవెంట్ కి సంబందించి ఏర్పాట్లు ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదు.
దానితో ప్రభాస్ ఫ్యాన్స్ లోనే అయోమయం ఉంది. మరి మిగతా ప్రేక్షకులు ఏం చేస్తారు. ఐదు భాషల్లో సినిమా విడుదలవుతుంది. ఏ భాషలోనూ సలార్ చప్పుడు లేదు. కాస్త డివైడ్ టాక్ వస్తే ఏం జరుగుతుందో అనేది ఈమధ్య కాలంలో చూస్తున్నాం. అలాంటిది సినిమాని ప్రమోట్ చెయ్యకుండా వదిలేస్తే ఎలా అంటూ మేకర్స్ పై అభిమానులే ఫైర్ అవుతున్నారు.