Advertisementt

పవన్ వీరమల్లు ఆగిపోయి ఏడాది పూర్తి!

Mon 11th Dec 2023 12:34 PM
pawan kalyan,hari hara veera mallu  పవన్ వీరమల్లు ఆగిపోయి ఏడాది పూర్తి!
Hari Hara Veera Mallu update పవన్ వీరమల్లు ఆగిపోయి ఏడాది పూర్తి!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్-క్రిష్ కలయికలో మొదలైన పిరియాడికల్ డ్రామా హరి హర వీరమల్లు షూటింగ్ అయిపోయి ఈ నెల డిసెంబర్ కి ఖచ్చితంగా ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది డిసెంబర్ లో ఆగిపోయిన వీరమల్లు షూటింగ్ ఇదిగో అదిగో మొదలవుతుంది అన్నారు. కానీ అది ఇప్పటివరకు జరగనే లేదు. ఈమధ్యలో హరి హర వీరమల్లు సెట్స్ లో అగ్నిప్రమాదం కూడా జరిగింది. అయితే వీరమల్లు షూటింగ్ కి బ్రేకులు పడినప్పటినుంచి దర్శకుడు క్రిష్ సైలెంట్ గానే ఉంటున్నారు. నిర్మాత ఏఎం రత్నం మాత్రం అప్పుడప్పుడు వీరమల్లుపై హడావిడిగా మాట్లాడుతున్నారు.

అయితే ఇప్పుడు హరి హర వీరమల్లు పై ఓ న్యూస్ వినిపిస్తోంది. వీరమల్లు కోసం ఏఏం రత్నం గారబ్బాయి జ్యోతికృష్ణ రంగంలోకి దిగనున్నట్టు సమాచారం. రూల్స్ రంజన్ సినిమా షూటింగ్ లో పడి బిజీగా ఉండటం వల్ల నాన్న రత్నం గారు వీరమల్లు సినిమా వ్యవహారాలు పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు హరి హర వీరమల్లు బడ్జెట్ చేయి దాటిపోవడంతో వడ్డీల బాధ ఎక్కువవడంతో రత్నం గారి అబ్బాయి స్వయంగా వీరమల్లు బాధ్యతలను తమ చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు వినికిడి. 

ఇప్పటివరకు పూర్తయిన షూటింగ్ కి పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా ఇంకా బాలన్స్ ఉన్న నలభై రోజుల షూటింగ్ కు సంబంధించిన ఖర్చులు, షెడ్యూల్స్, ఆర్టిస్టుల కాల్ షీట్లు అన్నిటిని అతనే చూసుకుని త్వరలోనే వీరమల్లు షూటింగ్ ముగించాలని అనుకుంటున్నారట. కాని పవన్ కళ్యాణ్ ఆంధ్ర ఎన్నికలు పూర్హయ్యేవరకు హరి హర వీరమల్లే కాదు, మిగిలిన రెండు సినిమాలు ఉస్తాద్, OG సినిమా షూటింగ్స్ కి కూడా దూరంగా ఉండాలనుకుంటున్నారని సమాచారం. చూద్దాం.. వీరమల్లులో కదలిక ఎప్పుడు వస్తుందో అనేది. 

Hari Hara Veera Mallu update:

Pawan Kalyan Hari Hara Veera Mallu shooting update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ