Advertisementt

సమంత సరికొత్త అవతారం

Mon 11th Dec 2023 08:37 AM
samantha  సమంత సరికొత్త అవతారం
Samantha trends in new avatar సమంత సరికొత్త అవతారం
Advertisement
Ads by CJ

ఖుషి మూవీ, సిటాడెల్ వెబ్ సీరీస్ షూటింగ్స్ పూర్తి కాగానే నటనకు బ్రేకిచ్చిన సమంత కొద్దిరోజులు ఆరోగ్యంపై శ్రద్ద పెట్టింది. ఖుషి సమయంలో సమంత లుక్స్ పై విమర్శలొచ్చాయి. ఫేస్ లో గ్లో లేదు అంటూ సమంత ఎక్స్ ప్రెషన్స్ ని పరిహాసం చేసారు. అయితే ఇప్పుడు సమంత మళ్ళి మునుపుటి ఉత్సాహంతో సరదాగా అందంగా కనిపిస్తుంది. యాక్టీవ్ గా ఫోటో షూట్స్ చేపించుకుంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టింది. దానితో మళ్ళీ సినిమాల్ బిజీ అయ్యేందుకు సమంత ఈ రేంజ్ అందాలు ఆరబోస్తుంది అనుకున్నారు.

ఆమె ఇప్పటివరకు నటనతోనే మెప్పించింది.. ఇప్పుడు సరికొత్తగా రాబోతుంది. అది కూడా సమంత నిర్మాతగా కొత్త అడుగు వెయ్యడానికి సిద్ధమైంది. ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపించి సినిమాలు నిర్మించేందుకు రెడీ అయ్యింది. ఆ నిర్మాణ సంస్థ కి ఓ మాంచి పేరు కూడా పెట్టింది. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ అంటూ పేరు పెట్టి దాని ద్వారా సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నట్లుగా సమంత చెప్పుకొచ్చింది.

ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ కి సంబందించిన లోగోని కూడా సమంత ఇన్స్టాలో షేర్ చేసింది. సినిమా ప్రపంచంలో కొత్త కథలని, ప్రామాణికమైన కథలని ఎంపిక చేసి ఈ వేదికపై నిర్మించనున్నట్లుగా సమంత తెలిపింది. మరి నటనతో పాటుగా సమంత నిర్మాతగానూ బిజీ కాబోతుందన్నమాట.

Samantha trends in new avatar:

Samantha Turns Producer With Tralala

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ