వరస ప్లాప్ లతో సతమతమవుతున్న నితిన్ ని వెంకీ కుడుములు భీష్మాతో ఆదుకున్నాడు. భీష్మ తో నితిన్ మళ్ళీ లైమ్ టైమ్ లోకి వచ్చేసాడు. ఆ సినిమా హిట్ తర్వాత నితిన్ వరసగా సినిమాలు చేస్తున్నాడు. కానీ సక్సెస్ మళ్లీ మళ్ళీ దూరమవుతూనే ఉంది. చెక్ మూవీ చేసాడు. అది బావుంది.. కానీ కలెక్షన్స్ లేవు. అలాగే మ్యాస్ట్రో వచ్చింది.. అది ఓటిటిలో విడుదలైంది. థియేటర్స్ లో అయితే అట్టర్ ప్లాప్ అయ్యేది.
అలాగే రంగ్ దే కూడా నితిన్ కి అనుకున్న హిట్ ఇవ్వలేదు. మాచర్ల నియోజకవర్గం గురించి చెప్పుకోటానికి ఏమి లేదు. మరి వరసగా నితిన్ సినిమాలు చేస్తున్నా.. కథలని జెడ్జ్ చెయ్యడంలో మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా అట్టర్ ప్లాప్ డైరెక్టర్ వక్కంతం వంశీతో ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్ చేసాడు. వక్కంతం రైటర్ గా హిట్, కానీ దర్శకుడిగా అతను ఫెయిల్ అని మరోసారి ఎక్స్ ట్రా నిరూపించింది. అది నితిన్ మెడకి చుట్టుకుంది.
ఈ సినిమా కూడా ప్లాప్ అవడంతో ఇప్పుడు నితిన్ కెరీర్ కూడా డేంజర్ లో పడింది. ఎక్స్ ట్రా వీకెండ్ లో బాగా డల్ అయ్యింది. ఇక రేపటి నుంచి అసలు కథ మొదలవుతుంది. సోమవారం నుంచి ఎక్స్ ట్రాకి కలెక్షన్స్ కనిపించవని బయ్యర్లు కూడా ఫిక్స్ అవుతున్నారు. మరి మళ్లి వెంకీ కుడుములతో చేస్తున్న మూవీనే నితిన్ కెరీర్ ని నిలబెట్టాలి. నిలబెడుతుంది అని నితిన్ ఫాన్స్ నమ్ముతున్నారు. నితిన్ కూడా నమ్మకం ఉంచాలి మరి. ఇంతకు ముంచి చేసేది కూడా ఏమి లేదు.