డిసెంబర్ 22 న ప్యాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సలార్ మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ఆ సినిమా అప్ డేట్ రాగానే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ప్రభాస్ తో పోటీపడే హీరో మలయాళం స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్.. వరదరాజులుగా పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు. అయితే సలార్ ప్రభాస్ దేవా పాత్రతో ఈక్వెల్ గా కనబడుతున్న పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రస్తుతం సలార్ డబ్బింగ్ ఫైనల్ కరెక్షన్స్ చేసినట్టుగా చెబుతూ ఓ పిక్ వదిలారు.
నేను ఎన్నో ఏళ్లగా పని చేసిన చాలా భాషల్లోని సినిమాల్లో నా పాత్రలన్నిటికి నేనే స్వంతంగా నా సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకునే అదృష్టం నాకు దక్కింది. చాలా భాషల్లో నా పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నాను. అయితే ఒకే కేరెక్టర్ కోసం ఒకే సినిమాలో ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పడం ఫస్ట్ టైమ్. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ మరియు మలయాళం. మరి ఇది ఏ సినిమా కోసం అనుకుంటున్నారు, అదే సలార్. సెంబర్ 22, 2023న ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్‌లలో దేవా మరియు వరద మిమ్మల్ని కలుస్తారు! 🔥
అంటూ పృథ్వీ రాజ్ సుకుమారన్ ఆ పిక్ తో పాటుగా తాను ఐదు భాషలకి సంబంధించి ఒకే కేరెక్టర్ కి డబ్బింగ్ చెప్పినట్టుగా ఆ పిక్ వదిలారు. మరి ప్రభాస్ దేవా కేరెక్టర్ తో స్నేహం, వైరం అంటూ వరదరాజులుగా పృథ్వీ రాజ్ సుకుమారన్ తన పవర్ చూపించడానికి సిద్ధమైపోయారు.