కొద్దిరోజులుగా వెండితెరపై కనిపించని సమంత సోషల్ మీడియాలో మాత్రం తరచూ దర్శనమిస్తుంది. హెల్త్ ట్రీట్మెంట్ అంటూ షూటింగ్స్ కి బిగ్ బ్రేక్ ఇచ్చేసిన సమంత ఫోటో షూట్స్ కి మాత్రం బ్రేకివ్వడం లేదు. సాకి వస్త్ర బ్రాండ్ పబ్లిసిటీ కోసం, అలాగే వేరే వేరే ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం సమంత ఫొటోస్ షూట్స్ తో తగ్గేదెలా అంటూ గ్లామర్ షో చేస్తుంది. అయితే సమంత తాజాగా హైదరాబాద్ AMB లో దర్శనమిచ్చింది.
ఆమె నాని నటించిన హాయ్ నాన్న మూవీ చూడడానికి AMB కి వచ్చింది. అది కూడా చిన్న పిల్లలతో కలిసి సమంత AMB లో హాయ్ నాన్నని వీక్షించింది. ప్రస్తుతం సమంత AMB లో సినిమా చూసేందుకు వెళుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సమంత ప్రెజెంట్ ఎలాంటి కథలు వినడం లేదు అని తెలుస్తుంది. మరో ఆరు నెలలు గడిచేవరకు సమంత నటన అంటూ స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదని, ఆరోగ్యం పూర్తిగా కుదుట పడ్డాకే ఆమె మళ్ళీ సెట్స్ లోకి వస్తుంది అని తెలుస్తోంది.