Advertisementt

శ్రీలీల కి ఎక్స్ ట్రా షాక్ లు

Sun 10th Dec 2023 11:03 AM
sreeleela  శ్రీలీల కి  ఎక్స్ ట్రా షాక్ లు
Continuous shocks for Sreeleela శ్రీలీల కి ఎక్స్ ట్రా షాక్ లు
Advertisement
Ads by CJ

వరస అవకాశాలతో దూసుకుపోతున్న శ్రీలీల స్పీడు కి ఇప్పుడు బ్రేకులు పడేలా కనిపిస్తున్నాయి. కారణం వరస వైఫల్యాలు ఆమె మెడకి చుట్టుకుంటున్నాయి. ఒకటా రెండా వరసగా మూడు డిజాస్టర్స్ శ్రీలీల అకౌంట్ లోకి మూడు నెలల్లో వచ్చి చేరాయి. స్కంద, ఆదికేశవ, నిన్నగాక మొన్న ఎక్సట్రార్డినరీ మ్యాన్ మూవీస్ తో శ్రీలీల కి ఎదురు దెబ్బలు తగిలాయి. లక్కీ హీరోయిన్ కాస్తా ఐన్ లెగ్ అయ్యి కూర్చుంది. 

శ్రీలీల లో అందం ఉంది, నటన ఉంది, డాన్స్ లు బావున్నాయి.. కానీ ఆమెకి సరైన పాత్ర పడడం లేదు. ఆమెని దర్శకులు వాడుకోవడంలో విఫలమవుతున్నారు. ఆమె పాత్రలకి నిడివి లేకుండా, ప్రాధాన్యత లేకుండా చేసేస్తున్నారు. అటు సినిమాల జెడ్జ్మెంట్ లో శ్రీలీల విఫలమవుతుంది అనే మాట కూడా వినిపిస్తుంది. నితిన్ తో అయినా హిట్ కొడదాము అనుకుంటే శ్రీలీల ని వక్కంతం కూడా మోసం చేసాడు. 

గ్లామర్ చూపించాడు కానీ ఆమెకి ప్లస్ పాయింట్ అయిన డాన్స్ ల్లోనూ ఆమెని సరిగ్గా వాడుకోలేదనే విమర్శలు వినిపించాయి. శ్రీలీల పాత్ర కూడా తేలిపోయింది. రామ్ తో స్కంద విషయంలో డాన్స్ ల్లో రెచ్చిపోయిన, పాత్రకి ప్రాధాన్యత లేదు, ఆదికేశవలోనూ అంతే, ఇక ఎక్సట్రార్డినరీ మ్యాన్ లోను శ్రీలీలకి అన్యాయమే జరిగింది. సరే శ్రీలీల పాత్ర తేలిపోయినా.. సినిమాలో విషయం ఉంటే అయినా సినిమా హిట్ అయ్యేది. అటు సినిమా ప్లాప్, ఇటు శ్రీలీలపై విమర్శలు. ఇదంతా చూస్తుంటే అయ్యో శ్రీలీల అనిపించకమానదు. 

Continuous shocks for Sreeleela:

Sreeleela got an Extra big shock

Tags:   SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ