Advertisementt

గుంటూరు కారం: ఇది కదా కిక్కంటే

Sat 09th Dec 2023 08:06 PM
mahesh babu  గుంటూరు కారం: ఇది కదా కిక్కంటే
Guntur Kaaram second single update గుంటూరు కారం: ఇది కదా కిక్కంటే
Advertisement
Ads by CJ

గుంటూరు కారం ఫస్ట్ లుక్ దగ్గర నుంచి నిన్నమొన్నటివరకు మహేష్ బాబు బీడీ లుక్ తప్ప మరేది లేదు, ఆఖరికి గుంటూరు కారం నుంచి మహేష్ బర్త్ డే కి వదిలిన వీడియో కానీ, ఫస్ట్ సింగిల్ ఇలా ఎందులోనూ హీరోయిన్స్ కి ప్లేస్ ఇవ్వలేదు. శ్రీలీలే బర్త్ డే కి ఆమె లంగావోణీ లుక్ వదిలారు తప్ప ఇప్పటివరకు గుంటూరు కారం అప్ డేట్స్ లో హీరోయిన్స్ కి చోటివ్వలేదు. అసలే పూజ హెగ్డే తప్పుకున్న స్థానంలోకి వచ్చిన మీనాక్షి చౌదరి గుంటూరు కారం లుక్ చూలాలని, ఇప్పటివరకు శ్రీలీల చేసిన సినిమాల కన్నా ఇందులో ఆమె స్పెషల్ ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలంతో ప్రేక్షకులు ఉన్నారు.

అయితే ఇప్పుడు గుంటూరు కారం నుంచి సెకండ్ సింగిల్ అప్ డేట్ వచ్చేసింది. అది కూడా క్యూట్ అండ్ లవ్లీ రొమాంటిక్ పిక్ రూపంలో సెకండ్ సింగిల్ అప్ డేట్ ఇచ్చారు. మహేష్ బాబు కి శ్రీలీల ముద్దిస్తున్న పిక్ రివీల్ చెయ్యడంతో ఇది కదా అసలు కిక్కు అంటూ మహేష్ ఫాన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. మహేష్ గొడుగు పట్టుకుని కూర్చుంటే.. పక్కనే కూచున్న శ్రీలీల మహేష్ కి గట్టిగా ముద్దు పట్టేస్తూ రొమాంటిక్ గా రెచ్చిపోయిన పిక్ అది.

నిజమే సోలోగా మహేష్ ని చూసినప్పటికన్నా ఇలా హీరోయిన్ శ్రీలీల తో చూడగానే అభిమానులు కూడా కిక్కొచ్చినట్టుగా ఫీలవుతున్నారు. మరి సినిమా విడుదల సమయానికి ఇలాంటివి ఓ నాలుగైదు పడితే చాలు సినిమాకి ఇంకాస్త హైప్ క్రియేట్ అవుతుంది.

Guntur Kaaram second single update:

Mahesh Babu starrer Guntur Kaaram second single finally gets a release date

Tags:   MAHESH BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ