Advertisementt

శ్రీలంక నుంచి HYD కి దగ్గుబాటి కొత్త జంట

Sat 09th Dec 2023 04:23 PM
abhiram daggubati,prathyusha  శ్రీలంక నుంచి HYD కి దగ్గుబాటి కొత్త జంట
Newlyweds Abhiram Daggubati And Prathyusha Return To Hyderabad శ్రీలంక నుంచి HYD కి దగ్గుబాటి కొత్త జంట
Advertisement
Ads by CJ

దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు, హీరో అభిరామ్ ఓ ఇంటివాడయ్యాడు. ఈ నెల 6 బుధవారం శ్రీలంకలో అభిరామ్ అతనికి వరసకు మరదలయ్యే ప్రత్యూష మెడలో మూడుముళ్లు వేసి ఏడడుగులు నడిచాడు. కారం చేడుకి చెందిన రిలేటివ్స్ అమ్మాయిని పెద్దలు నిశ్చయించగా అభిరామ్ అత్త కూతురు మెడలో మూడు ముళ్ళు వేసాడు. దుగ్గుబాటి ఫ్యామిలి, ప్రత్యూష ఫ్యామిలీ మెంబ్రేర్స్ తో పాటుగా అతి కొద్దిమంది మాత్రమే ఈవివాహానికి హాజరైనట్టుగా తెలుస్తుంది.

ఇక శ్రీలంక వేదికగా జరిగిన ఈ పెళ్లి తర్వాత అక్కడే అభిరామ్-ప్రత్యుషలకి కుటుంభం చిన్నపాటి రిసెప్షన్ జరిపించేసారు. ఆ తర్వాత అభిరామ్-ప్రత్యుషలు ఈ శుక్రవారం అంటే డిసెంబర్ 8 నైట్ హైదరాబాద్ కి వచ్చేసారు. కొత్త జంట ఎయిర్ పోర్ట్ లో నడిచొస్తున్న పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిరామ్ వైట్ అవుట్ ఫిట్ లో కనిపించగా ప్రత్యూష శారీ లో అందంగా కనిపించింది. ఇక అభిరామ్-ప్రత్యూషల జంట హైదరాబాద్ సురేష్ బాబు ఇంట్లో జంటగా అడుపెట్టారు. 

Newlyweds Abhiram Daggubati And Prathyusha Return To Hyderabad:

Abhiram Daggubati ties the knot with Prathyusha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ