Advertisementt

యానిమల్ ఫస్ట్ వీక్ కలెక్షన్లు ఎంతంటే..

Sat 09th Dec 2023 03:25 PM
animal  యానిమల్ ఫస్ట్ వీక్ కలెక్షన్లు ఎంతంటే..
Animal Unleashing Frenzy At The BO యానిమల్ ఫస్ట్ వీక్ కలెక్షన్లు ఎంతంటే..
Advertisement
Ads by CJ

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక హీరో హీరోయిన్ లుగా నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. మొదటి వారం కలెక్షన్స్ విషయంలో దాదాపు ఈ సినిమా సునామీని సృష్టించింది. టాలీవుడ్ దర్శకుడు మరోసారి బాలీవుడ్ లో మ్యాజిక్ చేశాడు. ఫస్ట్ వారం ఈ సినిమా రికార్డ్ కలెక్షన్లు సృష్టించి వెయ్యి కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. 

 

మొదటి వారం ఈ సినిమా 563.3 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. ఇంకా కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. ఈ వారం రెండు మూడు సినిమాలు విడుదలైనప్పటికీ యానిమల్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద విజయ దుందుభి మోగిస్తూనే ఉంది. మరో విశేషం ఏమిటంటే బాలీవుడ్ లో యానిమల్ 24 గంటలు ప్రదర్శియించబడడం విశేషం. 

 

ఈ మధ్య కాలంలో ఇప్పటి వరకు ఏ సినిమాకి ఇలా జరగలేదు. ఈ విషయంలో రికార్డ్ ల దిశగా దూసుకెళుతోంది. రోజు రోజుకి ఈ సినిమా కలెక్షన్లు పెరగడమే తప్ప తగ్గడం లేదు.ఈ సినిమాలో ఉన్న కంటెంట్ కి యూత్ అంతలా కనెక్ట్ అవుతోంది. యానిమల్ సాధించిన కలెక్షన్లు చూస్తుంటే ముందు ముందు మరిన్ని రికార్డ్ లు  బ్రేక్ చేయడం ఖాయమనేలా ట్రేడ్ నిపుణులు మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరు వాళ్ళ రివ్యూ ఇస్తూ ఉండడం మరో విశేషం. 

Animal Unleashing Frenzy At The BO:

Animal First Week Collections

Tags:   ANIMAL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ