Advertisementt

RC16 కి నటీనటులు కావలెను

Sat 09th Dec 2023 01:06 PM
rc 16  RC16 కి నటీనటులు కావలెను
RC 16 Comes Up With Exciting News RC16 కి నటీనటులు కావలెను
Advertisement
Ads by CJ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న RC 16 సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత ప్రస్తుతం శంకర్ తో గేమ్ ఛేంజర్‌ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ అయ్యినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మరోవైపు RC 16 కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నారు. అందులో భాగంగా తాజాగా నటీనటులు కావాలంటూ అప్డేట్ వచ్చింది. ప్రతేకంగా ఉత్తరాంధ్ర గ్రామ మాండలికం కలిగిన స్త్రీ పురుషులు కావాలని.. వయసుతో సంబంధం లేదు అని కూడా ప్రకటించారు మేకర్స్. దానికి సంబంధించి ఏవైనా రీల్స్ చేసి.. వాటిని rc16bb.casting@gmail.comకు పంపండి లేదా +91 8143682909 మెగాకు Whatsapp చేయండి. అని చెప్పారు.

 

ఈ చిత్రం గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఇది రంగస్థలం సినిమా వంటి మరో మైలురాయిలా ఉండనుందని అన్నారు.  

 

ఇంకా మేకర్స్ ఈ సినిమా గురించి ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించబడిన సినిమా అని.. ఇది ఒక పీరియాడికల్ ఎంటర్‌టైనర్ అని.. అంతేకాక ఇందులో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు పుకార్లు వినవస్తున్నాయి. ఈ సినిమా ఇండియన్ హెర్క్యులస్ కోడి రామ్మూర్తి నాయుడు కథ అని గతంలో వార్తలు కూడా వచ్చాయి.

RC 16 Comes Up With Exciting News:

Casting Call For RC 16

Tags:   RC 16
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ