Advertisementt

రోజా రెయిన్ డ్యాన్స్.. జగన్ పొటాటో పెర్ఫార్మెన్స్..!

Sat 09th Dec 2023 11:19 AM
ysrcp  రోజా రెయిన్ డ్యాన్స్.. జగన్ పొటాటో పెర్ఫార్మెన్స్..!
Roja rain dance.. jagan potato performance రోజా రెయిన్ డ్యాన్స్.. జగన్ పొటాటో పెర్ఫార్మెన్స్..!
Advertisement
Ads by CJ

ఏపీ సీఎం జగన్ ఏమో పొటాటో పెర్ఫార్మెన్స్ ఇస్తుంటే.. ఏకంగా మంత్రి రోజా రెయిన్ డ్యాన్సులు వేస్తోంది. వీరిద్దరినీ సోషల్ మీడియాలో జనం ఏకిపారేస్తున్నారు. మిచౌంగ్ తుపాను కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా రైతులు అయితే కోలుకోలేని దెబ్బ తిన్నారు. ఈ సందర్భంగా రోజాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జగన్ ఫోటోలు, వైసీపీ కలర్స్‌తో ఉన్న గొడుగుని పట్టుకుని వర్షంలో డ్యాన్సులు చేస్తోంది. మరి ఆవిడ తుపాను బాధితులను పరామర్శించేందుకు వెళ్లారో.. లేదంటే ఎక్కడికి వెళ్లారో తెలియదు కానీ ఆ రెయిన్ డ్యాన్సులు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 

జగన్ చేసిన సిత్రాలు అన్నీ ఇన్నీ కావు..

 

ఇక అంతే.. నెటిజన్లు మండిపడ్డారు. ఇలాంటి వాళ్లా మనల్ని పరిపాలించేదంటూ ఛీ కొడుతున్నారు. రైతులు ఒకవైపు వర్షాల కారణంగా చేతికొచ్చిన పంట నాశనమై హృదయవిదారకంగా విలపిస్తుంటే.. ఈ సమయంలో రోజాకు రెయిన్ డ్యాన్సులు కావల్సి వచ్చాయా? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక తాజాగా నేడు తుపాను బాధితులను పరామర్శించేందుకు గానూ..తిరుపతి జిల్లా వాకాడు మండలంలో  సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. అక్కడ జగన్ చేసిన సిత్రాలు అన్నీ ఇన్నీ కావు. పొటాటోను ఏమంటారంటూ జగన్ అధికారులను అడిగారు. అంతే అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. జగన్ నిజంగానే తెలియక అడుగుతున్నారా? లేదంటే ఆట పట్టిస్తున్నారో తెలియక అయోమయంలో పడిపోయారు.

 

సోషల్ మీడియా ఊరుకుంటుందా? 

 

అంతేనా.. పొటాటోను తెలుగులో ఉల్లిగడ్డే అంటారు కదా అని అడగడంతో జనాలు కూడా ఆశ్చర్యపోయారు. అలాగే రేషన్ వివరాలు వెల్లడిస్తూ  కేజి ఆనియన్, కేజి ఉల్లిగడ్డ అని జగన్ వ్యాఖ్యానించారు. ఏంటి ఇదంతా అసలు తాము చూస్తున్నది నిజమేనా? కాదా? తెలియక అంతా తెల్లమొహం వేసేశారు. మొత్తానికి పొటాటోను ఏమంటారనేది అధికారులను అడిగి తెలుసుకుని అదో నిజమో.. కాదోనన్న సందిగ్ధమో ఏమో కానీ బంగాళా దుంప అని మూరెడు పొడవు సాగదీశారు. ఇక సోషల్ మీడియా ఊరుకుంటుందా?  ఆలుగడ్డకు, ఉల్లిగడ్డకు తేడా తెలియని సీఎం అంటూ ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్ తీరు ఇలా.. మంత్రుల తీరు అలా అంటూ విపక్షాలు సైతం ఏకి పారేస్తున్నాయి. ఈ పొటాటో పెర్ఫార్మెన్స్‌లు, రెయిన్ డ్యాన్సులు అవసరమా? అంటూ జనం మండిపడుతున్నారు.

Roja rain dance.. jagan potato performance:

Memes viral on ycp leaders

Tags:   YSRCP
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ