Advertisementt

Yash 19 టైటిల్ ఫిక్స్..

Sat 09th Dec 2023 10:04 AM
yash 19  Yash 19 టైటిల్ ఫిక్స్..
Yash19 is titled Toxic Yash 19 టైటిల్ ఫిక్స్..
Advertisement
Ads by CJ

రాకింగ్ స్టార్ యష్ నుండి సినిమా వచ్చి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది.కెజియఫ్ 2 తర్వాత యష్ ఎలాంటి సినిమా చేయనున్నాడో అని, ఆయన అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గానే తన తదుపరి సినిమాకు సంబంధించి యష్ చిన్న హింట్ ఇచ్చాడు. ఇప్పుడా సినిమా టైటిల్ కూడా రివీల్ చేశారు.

 

యష్ తదుపరి చేయబోతున్న YASH 19 సినిమా టైటిల్ ఏంటంటే.. టాక్సిక్. తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేస్తూ టైటిల్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అప్స్ అనేది ఈ సినిమాకి ఉపశీర్షిక. టైటిల్ తెలుపుతూ విడుదల చేసిన గ్లింప్స్ ఆకర్షణీయంగా ఉంది. మరో సర్ ప్రైజింగ్ విషయం ఏమిటంటే.. టైటిల్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం.

 

కె వి ఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ల పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకుడు. రెండు వేర్వేరు ప్రపంచాల కలయికగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నిర్మాత వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్  తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. రిలీజ్ వీడియోలో ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 10 ఏప్రిల్, 2025 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. 

Yash19 is titled Toxic:

Yash 19 gets a solid title

Tags:   YASH 19
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ