Advertisementt

కేసీఆర్ కి గాయం.. 11 గంటలకు శస్త్ర చికిత్స

Fri 08th Dec 2023 09:03 PM
kcr  కేసీఆర్ కి గాయం.. 11 గంటలకు శస్త్ర చికిత్స
Accident to Telangana former CM KCR కేసీఆర్ కి గాయం.. 11 గంటలకు శస్త్ర చికిత్స
Advertisement
Ads by CJ

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖరరావు కాలి తుంటికి రెండు చోట్ల గాయమైంది. ప్రస్తుతం ఆయన సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎన్నికల్లో అపజయం పాలైన నాటి నుంచి కూడా కేసీఆర్ ఎర్రవెల్లి ఫాం హౌస్‌కి పరిమితమయ్యారు. అయితే గత అర్థరాత్రి బాత్రూంలో ఆయన కాలు జారి పడిపోయారు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం యశోదకు తరలించారు.

కేసీఆర్‌ను పరీక్షించిన వైద్యులు ఆయన తుంటి ఎముక రెండు చోట్ల విరిగినట్టు గుర్తించారు. నేటి మధ్యాహ్నం పదకొండు గంటలకు శస్త్ర చికిత్స నిర్వహించనున్నారని సమాచారం. తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్స్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా తుంటి బాల్ డ్యామేజ్ అయినట్లు వైద్య బృందం గుర్తించింది. ప్రస్తుతం హాస్పిటల్‌లో కేసీఆర్ వెంట కేటీఆర్, కవిత, హరీష్ రావు ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. 

కాగా.. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఒకవైపు ఫలితాలు వెలువడుతుండగానే ప్రగతి భవన్‌ను వదిలి కేసీఆర్ ఫామ్ హౌస్‌కి వెళ్లిపోయారు. అప్పటి నుంచి కూడా ఆయన అక్కడే ఉంటున్నారు. పార్టీ కార్యకలాపాలన్నీ.. నేతలతో మంతనాలు తదితర వ్యవహారాలన్నీ అక్కడి నుంచే చూసుకుంటున్నారు. ఒకవైపు కేటీఆర్ సైతం పార్టీ నేతలకు టచ్‌లో ఉంటూ పార్టీ కార్యకలాపాలను చూసుకుంటున్నారు.

Accident to Telangana former CM KCR:

Operation to KCR

Tags:   KCR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ