తెలంగాణలో పరిస్థితులు మారిపోయాయి. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలిసారిగా బీఆర్ఎసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటివరకు ఓ లెక్క… ఇక నుంచి మరో లెక్క… కాంగ్రెస్ పాలన అనూహ్యంగా మొదలైంది. సీఎంగా రేవంత్‌రెడ్డి, పలు శాఖల మంత్రులు కాంగ్రెస్ కీలక నేతలు ప్రమాణ స్వీకారం చేశారు. అధికార బాధ్యతలు చేపట్టక ముందే ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టించాలని డిసైడ్ అయ్యారు. దీనికి కారణంగా రేవంత్ సహా పలువురు నేతలంతా ప్రగతి భవన్‌లోకి వెళ్లడానికి వీలు పడక వెనుదిరిగిన వారే. వచ్చిన వారెవరైనా సరే.. కేసీఆర్ పాలనలో వెళ్లేందుకు అనుమతి ఉండాల్సిందే.
ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్..
గతంలో రాజుల కాలంలో గంట మోగిస్తే అయినా వారు కరుణించి లోపలికి పిలిచి సమస్యేంటో కనుక్కునేవారు కానీ కేసీఆర్ పాలనలో అది కూడా ఉండేది కాదు. ఇప్పుడు ప్రగతి భవన్ పేరుని జ్యోతీరావు ఫూలే ప్రజాభవన్‌గా మార్చుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే ప్రజాభవన్ చుట్టూ నిర్మించిన బారీ ఇనుప గ్రిల్స్, బారికేడ్లను తొలగింపజేయించారు. సామాన్య ప్రజలు సైతం ఇకపై నేరుగా ప్రగతి భవన్‌లోకి ప్రవేశించవచ్చు. ప్రతీ శుక్రవారం ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్టు రేవంత్ వెల్లడించారు. తద్వారా ప్రజల సమస్యలని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
వెల్లువెత్తుతున్న మీమ్స్, రీల్స్..
ఒకప్పుడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రగతి భవన్‌కు వెళ్లిన రేవంత్ రెడ్డికి అనుమతి లేదంటూ పోలీసులతో గేటు వద్ద ఆపించేసి తిప్పి పంపించారు.
అలాంటి రేవంత్ ఇప్పుడు ప్రగతి భవన్‌లోకి వెళ్లి ఏకంగా కేసీఆర్ ముచ్చటపడి స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్న ఛాంబర్‌లో ఆయన కూర్చొన్న కుర్చీలోనే రేవంత్ కూర్చోబోవటం ఆసక్తికరంగా మారింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలంటూ జనాల్లో చర్చ జరుగుతోంది. ఇక సచివాలయం.. రేవంత్ కోసమే కేసీఆర్ నిర్మించారంటూ సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్ వెల్లువెత్తుతున్నాయి. నిజానికి సచివాలయం నిర్మించిన ఎంతో కాలం పాటు కేసీఆర్ అధికారంలో ఉండలేదు. ఇది నిజంగానే రేవంత్ కోసమే కట్టించినట్టుగా ఉంది. ఇప్పటికే రేవంత్ సచివాలయంలోకి వెళ్లారు. నిజానికి ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్ అధినాయకత్వానికి కొంచెం జీర్ణం కావడం కష్టమే.