తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే కొందరు మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రిగా భట్టి విక్రమార్క, హోంశాఖా మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖా మంత్రిగా దామోదర రాజనర్సింహ, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు, నీటి పారుదల శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆర్థిక శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క, పౌరసరఫరాల శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి-మున్సిపల్, పొన్నం ప్రభాకర్-బీసీ సంక్షేమశాఖ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొండా సురేఖ ప్రమాణ స్వీకారం చేశారు.
కేటీఆర్‌కు ఒక స్టెప్ పైనే ఉండాలి..
మొత్తంగా 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తుమ్మల, దామోదర రాజనర్సింహ వంటి వారికి గతంలో వారు నిర్వహించిన శాఖలనే అప్పగించారు. అయితే కీలక శాఖ అయిన ఐటీ ఎవరికి కేటాయిస్తారనేది తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో కేటీఆర్ ఐటీ శాఖను చేపట్టి తెలుగు రాష్ట్రాలు నివ్వెరబోయేలా పరిశ్రమలను తీసుకొచ్చారు. ఐటీని హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని టూ టైర్ నగరాలకు కూడా విస్తరించిన ఘనత ఆయనదే. ఇప్పుడు ఐటీ మంత్రి ఆయనకు ఒక స్టెప్ పైనే ఉండాలి. అలా ఉండలేకపోయినప్పటికీ కేటీఆర్‌కు సరిసమానంగా ఆ శాఖను తీర్చిదిద్దే వ్యక్తికి అప్పించాలి. మరి అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? అనేది చర్చనీయాంశంగా మారింది. అందరి చూపూ ఈ శాఖపైనే ఉంది.
హాట్ టాపిక్‌గా ఐటీ శాఖ..
తెలంగాణకు దిక్సూచి లాంటి ఐటీ శాఖను ప్రస్తుతం రేవంత్ తన వద్దే ఉంచుకున్నారు. రెండో విడత కేబినెట్ విస్తరణలో ఆ కీలక పోస్టును మరొకరికి కేటాయిస్తారా.. లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. పైన పేర్కొన్న ఏ శాఖను ఫిల్ చేయకున్నా ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదేమో కానీ ఐటీ శాఖ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ కొత్త ఐటీ మంత్రిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఫర్‌ఫెక్ట్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఐటీ మంత్రి మదన్ మోహనే అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. మదన్ మోహన్ రావు ది వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. యూఎస్ఎమ్ బిజినెస్ సిస్టమ్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. కేటీఆర్‌కు ధీటైన వ్యక్తి మదన్‌మోహనరావేననే చర్చ అయితే సర్వత్రా జరుగుతోంది. మరి రేవంత్ ఏం చేస్తారో చూడాలి.