Advertisementt

NTR31: ఒక్క మాటకే ఇంత హైపా..

Thu 07th Dec 2023 10:17 PM
ntr31  NTR31: ఒక్క మాటకే ఇంత హైపా..
Prashanth Neel shares delightful news about NTR 31 NTR31: ఒక్క మాటకే ఇంత హైపా..
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కెజియఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా తెరకెక్కబోతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి. NTR31గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఒకే ఒక్క మాట ప్రశాంత్ నీల్ ఇలా చెప్పాడో లేదో.. సోషల్ మీడియా అంతా షేకవుతోంది.. ట్రెండ్ బద్దలవుతోంది. ఇంతకీ ప్రశాంత్ నీల్ ఈ సినిమా గురించి ఏం చెప్పాడని అనుకుంటున్నారా..?

కెజియఫ్ సిరీస్ చిత్రాలు, సలార్.. ఈ చిత్రాలకు భిన్నంగా ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా ఉంటుందని, చాలా విభిన్నంగా ఆ కథని రెడీ చేశానని నీల్ చెప్పుకొచ్చాడు. నేపథ్యం ఏమిటనేది నీల్ చెప్పకపోయినప్పటికీ.. ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోల్చితే విభిన్నంగా ఉంటుందని అన్నాడు. అంతా యాక్షన్ సినిమా అనుకుంటున్నారు.. కానీ ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యే విధంగా కథ ఉంటుందని ప్రశాంత్ నీల్ ఇచ్చిన హింట్‌తో టైగర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాపై దండెత్తారంటే నమ్మాలి. సలార్ విడుదల అనంతరం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఎన్టీఆర్ సినిమా షూట్ మొదలవుతుందని కూడా నీల్ క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం ప్రభాస్‌తో చేసిన సలార్ ప్రమోషన్స్‌లో ప్రశాంత్ నీల్ ఈ విషయాలు చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌తో చేసే సినిమా గురించే కాదు.. కెజియఫ్ 3 గురించి కూడా ప్రశాంత్ నీల్ అప్‌డేట్ ఇచ్చాడు. కెజియఫ్ 3 ఉంటుంది.. అందుకే రెండో పార్ట్‌ ఎండింగ్‌లో హింట్ ఇచ్చాం అని తెలిపారు. మొత్తంగా చూస్తే.. సలార్ ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్, యష్ అభిమానులకు మాత్రం మాంచి ట్రీట్ దొరుకుతుండటం గమనించవచ్చు.

Prashanth Neel shares delightful news about NTR 31:

Delightful news about NTR 31

Tags:   NTR31
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ