తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎనుమల రేవంత్‌రెడ్డి కాసేపట్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. పలు చర్చల అనంతరం ఫైనల్‌గా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డినే కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా నేడు (డిసెంబర్ 7) ప్రమాణస్వీకారం చేయనునున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మొత్తం 12 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి ముఖ్యనేతలుగా ఉన్న ముగ్గురికీ కేబినెట్‌లో చోటు దక్కినట్లుగా తెలుస్తోంది. మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మల్లు భట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఫైనల్ చేశారని తెలుస్తోంది.
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కిందంటే..
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
భట్టి విక్రమార్క
ఉత్తమ్ కుమార్ రెడ్డి
దామోదర రాజనర్సింహ
కొండా సురేఖ
జూపల్లి కృష్ణ రావు
పొన్నం ప్రభాకర్
సీతక్క
శ్రీధర్ బాబు
తుమ్మల నాగేశ్వరరావు
పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నేడు వీరంతా రేవంత్ రెడ్డితో పాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఎవరెవరు ఏ యే మంత్రి అనేది ఇంకా తెలియరాలేదు.