Advertisementt

Hi Nanna: ఫ్యాన్స్‌కు జెర్సీ ట్రైన్ ఫీల్

Thu 07th Dec 2023 06:47 PM
hi nanna  Hi Nanna: ఫ్యాన్స్‌కు జెర్సీ ట్రైన్ ఫీల్
Hi Nanna Twitter Talk Hi Nanna: ఫ్యాన్స్‌కు జెర్సీ ట్రైన్ ఫీల్
Advertisement
Ads by CJ

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని చేసిన సినిమా హాయ్ నాన్న. వైర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. శౌర్యువ్ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. నాని సరసన సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తే.. శృతిహాసన్, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా నేడు (డిసెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీమియర్స్ పడ్డాయి. యుఎస్‌లోనూ షోస్ పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమాకు ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే.. 

ఒక్కటే మాట.. నాని ఫ్యాన్స్ ఈ సినిమాతో జెర్సీలో నాని ట్రైన్ సీన్‌ని ఫీలవుతారనేలా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. నాని కెరీర్‌లోనే అత్యుత్తమ సినిమాగా చాలా మంది ట్విట్టర్‌లో రివ్యూ ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ సినిమా చూసిన వారంతా 3 నుండి 4 స్టార్లు ఇస్తున్నారు. అలాగే నాని, మృణాల్‌.. పాప కియారా నటన బాగుందంటూ రివ్యూస్‌లో చెబుతున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ ఎమోషన్స్ బాగా పండాయని, సినిమా చూసే వారంతా కన్నీళ్లు పెట్టుకోవడం కాయం అనేలా సినిమా గురించి చెబుతున్నారు. మరి ట్విట్టర్ టాక్ ఇలా ఉంది.. అసలు రివ్యూవర్స్ ఓపెనియన్ ఎలా ఉందో కాసేపట్లో తెలిసిపోనుంది.

మొదటి నుండి ఈ సినిమాను హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే మేకర్స్ ప్రచారం చేస్తూ వస్తున్నారు. నాని కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లుగా ప్రమోషన్స్‌లో కనిపించారు. మొత్తంగా అయితే ఇప్పటి వరకు ట్విట్టర్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. నానికి మరో హిట్ పడినట్లుగానే చెప్పుకోవచ్చు.

Hi Nanna Twitter Talk:

Hi Nanna Movie Twitter Review

Tags:   HI NANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ