Advertisementt

పవన్‌తో కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌!

Thu 07th Dec 2023 06:34 PM
pavan kalyan ram  పవన్‌తో కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌!
Movie in Pavan and Kalyan Ram Combo పవన్‌తో కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌!
Advertisement
Ads by CJ

టైటిల్ చూసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి మల్టీస్టారర్ సినిమా ఏమైనా ప్లాన్ చేసి ఉంటారని అనుకుంటున్నారేమో. అలాంటిదేమీ లేదు. గతంలో కూడా ఇలానే ఓసారి వార్తలు వినిపించాయి. అయితే ఇక్కడ అనుకుంటున్న పవన్.. అందరూ అనుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు. ప్రేమ-ఇష్క్-కాదల్ చిత్ర దర్శకుడు పవన్ సాధినేని. ఈ మధ్య ఈ దర్శకుడి పేరు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సేనాపతి, దయా వెబ్ సిరీస్‌లే అందుకు కారణం. 

ఈ రెండు వెబ్ సిరీస్‌లు సక్సెస్ సాధించడంతో.. గతంలో ఆయన చేయాలనుకున్న మల్టీస్టారర్ చిత్రాన్ని మళ్లీ బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా టాక్ వినబడుతోంది. నందమూరి హరికృష్ణ బతికున్నప్పుడు పవన్ సాధినేని ఓ కథను వినిపించి.. ఓకే చేయించుకున్నారు. అందులో కళ్యాణ్ రామ్ మెయిన్ హీరో కాగా, హరికృష్ణది కీలకమైన పాత్ర. అంతా అనుకుంటున్న సమయంలోనే హరికృష్ణ యాక్సిడెంట్‌కు గురై మృతి చెందారు. దీంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. 

మళ్లీ ఇన్నాళ్లకు ఆ ప్రాజెక్ట్‌కు మోక్షం లభించబోతున్నట్లుగా తెలుస్తోంది. అప్పుడనుకున్న కథలోనే కొద్దిగా మార్పులు చేసి హరికృష్ణ పాత్రలో టాలీవుడ్‌కి చెందిన ఓ అగ్రహీరోని నటింపజేయాలనే ప్లాన్‌లో పవన్ సాధినేని, కళ్యాణ్ రామ్ ఉన్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఆ అగ్ర హీరో ఎవరనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేస్తున్న డెవిల్ పూర్తయిన వెంటనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందనేదనేలా వార్తలు వినబడుతున్నాయి.

Movie in Pavan and Kalyan Ram Combo:

Kalyan Ram Plans Multi-Starrer with Pavan  

Tags:   PAVAN KALYAN RAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ