Advertisementt

ఇదే రేవంత్ రెడ్డి ఆహ్వానం

Thu 07th Dec 2023 04:06 PM
revanth reddy  ఇదే రేవంత్ రెడ్డి ఆహ్వానం
Revanth Reddy swearing-in ceremony Invitation ఇదే రేవంత్ రెడ్డి ఆహ్వానం
Advertisement
Ads by CJ

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోంది.. దీనికి అందరూ హాజరు కావాలంటూ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. ఈ ఆహ్వానంతో పాటు కాంగ్రెస్ పెద్దలను కలిసి తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తోన్న ఫొటోలను ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, రేవంత్ రెడ్డి ఆహ్వానం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేవంత్ ఆహ్వానంలో ఏమని పేర్కొన్నారంటే.. 

ప్రజా ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ఆహ్వానం

తెలంగాణ ప్రజలకు అభినందనలు. 

విద్యార్ధుల పోరాటం, అమరవీరుల త్యాగాలు, శ్రీమతి సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది.  

రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు... బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు..

మీ అందరి ఆశీస్సులతో 2023, డిసెంబర్ 7న మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోంది. 

ఈ మహోత్సవానికి రావాల్సిందిగా మీ అందరికి ఇదే ఆహ్వానం.

మీ రేవంత్ రెడ్డి

సీఎల్పీ నాయకుడు

Revanth Reddy swearing-in ceremony Invitation:

Revanth Reddy Ready to Take Oath as a Telangana Second CM 

Tags:   REVANTH REDDY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ