ఆర్యభట్ట, పవన్ కళ్యాణ్ ఒకటే అంటున్నారు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రీసెంట్‌గా జరిగిన తెలంగాణ ఎన్నికలలో పోటీ చేసిన జనసేన పార్టీ.. ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంపై.. వర్మ తన థియరీని ఈ విధంగా ఓపెన్ చేశాడు.
గణితంలో ఆర్యభట్ట జీరో కనిపెడితే.. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ జీరోని కనిపెట్టాడు అంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ వేశాడు వర్మ. ఆయన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కారణం.. వర్మని తిట్టేవారు కొందరైతే.. వర్మ చేసిన ట్వీట్ బహు బాగు అంటూ పొగిడేవారు కొందరు.. ఇలా అందరి కామెంట్లతో వర్మ ట్వీట్ వైరల్‌గా మారింది.
అయితే ఈ ట్వీట్‌పై కొందరు జనసైనికులు చేస్తున్న కామెంట్స్‌ని కనుక వర్మ చూస్తే.. జన్మలో మళ్లీ పవన్ కళ్యాణ్‌పై పోస్ట్ చేయడు. ఎందుకంటే, వర్మ అభిమానిస్తున్న వైసీపీ పార్టీ కానీ, దానికి పిల్ల పార్టీ అయిన షర్మిల పార్టీకానీ అసలు పోటీనే చేయకుండా ఓటమిని ఒప్పుకున్నారు. అలాంటిది ఫస్ట్ టైమ్ ధైర్యంగా 8 చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గొప్పా, లేక నీ ఆరాధ్య దైవాలు గొప్పా.. అంటూ గట్టిగానే ఏసుకుంటున్నారు. అలాగే నీ విమర్శలో కూడా పవన్‌ని ఓ గొప్ప వ్యక్తితో పోల్చావు చూడు.. అది పవన్ కళ్యాణ్ అంటే.. అంటూ వర్మ ట్వీట్‌ని వర్మకే తిప్పికొడుతున్నారు.