Advertisementt

గేమ్ ఛేంజర్ అప్ డేట్ పై కామెడీ కామెంట్స్

Tue 05th Dec 2023 04:03 PM
game changer  గేమ్ ఛేంజర్ అప్ డేట్ పై కామెడీ కామెంట్స్
A comedy comments about a Game Changer update గేమ్ ఛేంజర్ అప్ డేట్ పై కామెడీ కామెంట్స్
Advertisement
Ads by CJ

రెండు రోజుల క్రితం గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు గారు రామ్ చరణ్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయ్యింది, త్వరలోనే షూటింగ్ మొత్తం పూర్తి చేస్తామంటూ అప్ డేట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ అప్ డేట్ పై సోషల్ మీడియాలో కామెడీ జోక్స్ పేలుతున్నాయి. ఎందుకంటే ఇంకా షూటింగ్ 20 శాతం మాత్రమే బ్యాలెన్స్ వుంది. ఆ 20  శాతం పూర్తయ్యాకే రిలీజ్ డేట్ ఇస్తామంటున్నారు. అదేమో 2025 సంక్రాంతి అంటూ ప్రచారం జరుగుతుంది.

అంటే షూటింగ్ పూర్తయ్యాక ఓ ఆరు నెలలు అయితే పోస్ట్ ప్రొడక్షన్ ని టైమ్ సరిపోతుంది. కానీ శంకర్ కి ఇంకా ఏడాది సమయం కావాలా.. అటు ఇండియన్ 2 కి కూడా డేట్ ఇవ్వలేదు, అసలు 2024 లో ఇండియన్ 2 అయినా రిలీజ్ అవుతుందా అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. శంకర్ డిలే చేస్తారు కానీ.. మరీ ఇంత లేటా అంటూ మెగా ఫాన్స్ కూడా డిస్పాయింట్ అవుతున్నారు. 

దివాళికి రావాల్సిన గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్ పోస్ట్ పోన్ అయ్యి నెల గడిచినా ఇప్పటికి ఆ సాంగ్ కొత్త డేట్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదు. అసలు దిల్ రాజుగారు గేమ్ ఛేంజర్ ముచ్చట్లు చెప్పడమే మానేశారు. కానీ ఇప్పుడు ఆ సినిమాపై అప్ డేట్ ఇచ్చి ఇలా దొరికిపోయారనే మాట వినిపిస్తుంది. 

A comedy comments about a Game Changer update:

Game Changer update 

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ