పదేళ్ల BRS పాలనకు స్వస్తి పలికి, BRS ని పూర్తిగా ఓడించి భారీ మెజారిటీతో కాంగ్రెస్ ని గెలిపించిన ప్రజలు ఇప్పుడు సిగ్గుపడుతున్నారా? సోషల్ మీడియాలో అదే కనిపిస్తుంది. గెలిపించింది తెలంగాణ ప్రజలు. అది కూడా రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ప్రభుత్వాన్ని ఎర్పాటు చేస్తుంది అని. కానీ ఇప్పుడు తెలంగాణ సీఎం ని ఢిల్లీ పెద్దలు డిసైడ్ చేయడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. దానికి మధ్యవర్తులు కర్ణాటక సీఎం శివకుమార్ అంటూ మాట్లాడుకుంటున్నారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ని ముందుకు నడిపించిన తీరు నచ్చే ప్రజలు కాంగ్రెస్ ని గెలిపించారు. BRS ఏదో తప్పు చేసింది అని కాదు, పదేళ్ల వాళ్ళ పాలన చూసాం, ఓ ఐదేళ్లు వీళ్ళ పాలన చూద్దామని తెలంగాణ ప్రజలు డిసైడ్ అయ్యారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది ఏమిటి.. రేవంత్ రెడ్డి సీఎం అంటే కాంగ్రెస్ పెద్దలు ఒప్పుకోవడం లేదు. మేము సీఎం అంటే మేము సీఎం అని కొట్టుకు చస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో కుర్చీల ఆట మొదలైంది.
రేవంత్ రెడ్డి సీఎం అంటే ఒప్పుకోని పెద్దలు ఢిల్లీ కి పయనమయ్యారు. ఉత్తమ్ కుమార్ ఎవరు సీఎం అయినా ఓకె అంటారు. భట్టికి సీఎం అవ్వాలనే కోరిక ఉంది. డిప్యూటీ ఇస్తా అంటే ఓకె అని.. అది నా ఒక్కడికే కావాలంటాడు. ఇక దామోదర, శ్రీధర్ లాంటి వారు రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎలాంటి హోప్స్ లేకుండా మూలానపడిన కాంగ్రెస్ ని రేవంత్ రెడ్డి ఎలాగో ఓ కొలిక్కి తెచ్చి అధికారాన్ని తెస్తే ఇప్పుడు కుర్చీ కోసం కొట్టుకు చస్తున్న వారిని చూసి ప్రజలు సిగ్గుపడక ఏం చేస్తారు.