Advertisementt

పవన్ కళ్యాణ్ మారాల్సిన టైమ్ వచ్చింది

Tue 05th Dec 2023 01:55 PM
pawan kalyan  పవన్ కళ్యాణ్ మారాల్సిన టైమ్ వచ్చింది
People want change in Pawan Kalyan పవన్ కళ్యాణ్ మారాల్సిన టైమ్ వచ్చింది
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ మారాల్సిన టైమ్ వచ్చేసింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఇస్తున్న సలహా, సూచన. కారణం పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలు, రాజకీయాలు అంటే వర్కౌట్ అవ్వదు. ఏదో ఒకదానికి స్టిక్ అయ్యి ఉండాలి. ఉంటే సినిమా షూటింగ్స్ లో, లేదంటే పూర్తిగా రాజకీయాల్లో ఉంటేనే జనసేన ఎంతోకొంత బలపడుతుంది. కాదు నేను సినిమాలు చేసుకుంటాను, ఖాళీ సమయాల్లో రాజకీయాలు కెలుకుతాను అంటే తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు జనసేనకు ఎలాంటి తీర్పునిచ్చారో అదే తీర్పు ఏపీలో కూడా ఉంటుంది అనేది ఈ సలహాదారుల మాట.

అప్పటికప్పుడు బిజెపితో కలిసి తెలంగాణ ఎన్నికల్లో జనసేనని పోటీకి దింపడం పవన్ కళ్యాణ్ రాజకీయ తెలివితేటలకు నిదర్శనం, ఇలాంటి పవన్ కళ్యాణ్ అక్కడ ఆంధ్ర ప్రజలని ఏమి ఉద్ధరిస్తాడంటూ బ్లూ మీడియా చంకలు గుద్దుకుంటుంది. పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి ఎంచుకోవాలి, అప్పుడే జనసేన ఏపీలో ఈ ఎన్నికల సమయానికి బలపడుతుంది. లేదంటే తెలంగాణాలో మాదిరే ఏపీలోనూ జనసేన బిచాణా సర్దేస్తుంది

జనసేన మీటింగ్స్ కి జనాలు వేలల్లో వచ్చినా.. ఓట్స్ మాత్రం వందల్లో వస్తున్నాయి. కేండిడేట్స్ డిపాజిట్స్ కూడా కోల్పోతున్నారు. పవన్ కి సినిమాల్లో ఉన్న క్రేజ్ రాజకీయాలకి పనికిరాదు. అందుకే పవన్ అలోచించి నిర్ణయం తీసుకోవాలని జనసైనికులు కూడా మనసులో కోరుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల వరకు ఏపీ ప్రజల్లో తిరుగుతారేమో చూద్దాం. 

People want change in Pawan Kalyan :

Pawan should choose something, movies or Politics

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ