ఇప్పుడు సురేఖ వాణి కూతురు సుప్రీత అంటే తెలియని వారు లేరు. సురేఖ వాణి కూతురుగా నిన్నమొన్నటివరకు కనిపించిన ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో చేసే రచ్చతో సుప్రీత పేరు మోగిపోతుంది. తల్లీ కూతుళ్లు సోషల్ మీడియాలో రీల్స్ తో, డాన్స్ లతో హోరెత్తించేస్తున్నారు. సురేఖ వాణి భర్త చనిపోయాక కూతురు తో కలిసి ఒంటరిగా లైఫ్ ని లీడ్ చేస్తుంది. స్వేచ్ఛ వచ్చిన పక్షుల్లా తల్లి కూతుళ్లు హడావిడి చెయ్యడం వెనుక సుప్రీతని ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇప్పించే ఏర్పాట్లని సురేఖ వాణి ఇలా మొదలు పెట్టినట్లుగా టాక్.
అయితే ఈ తల్లీ కూతుళ్ళకి సోషల్ మీడియాలో ఎంతగా పాపులారిటీ ఉందొ అంతకన్నా ఎక్కువగా నెగిటివిటీ ఉంది. తరుచూ వీరి రీల్స్ పై ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణ ఎలక్షన్స్ లో సురేఖ వాణి ఆమె కుమార్తె BRS కి సపోర్ట్ గా విచ్చలవిడిగా రీల్స్ చేసారు. అయితే ఈ ఎన్నికల్లో BRS ఓడిపోయిన రోజే సుప్రీత BRS కి సపోర్ట్ గా చేసిన రీల్స్ ని డిలేట్ చేసేసి వెంటనే ఎప్పుడో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో దిగిన పిక్ ని పోస్ట్ చేసింది.
దానితో సురేఖ వాణి, సుప్రీతపై సోషల్ మీడియాలో నెటిజెన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఎపుడూ నెగిటివిటీని ట్రోల్స్ ని పట్టించుకోని సుప్రీత మొదటిసారి ట్రోల్స్ పై స్పందించింది. పాలిటిక్స్ లోకి నన్ను లాగి నా పేరు ట్యాగ్ చేసి ట్రోల్ చేస్తున్నారు. నేను BRS కి సపోర్ట్ చేస్తూ రీల్స్ చేశాను. అందులో తప్పేముంది. అలాగే గెలిచిన రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ చెప్పాము, ఇందులో నన్ను తప్పుబట్టి ట్రోల్స్ చెయ్యాల్సిన అవసరం ఏముంది. నేను మీకేం అన్యాయం చేశాను, నన్ను ఇంతగా బాధపెట్టాలా..
నాపై ఎందుకింత కోపం, ద్వేషం. నన్ను ట్రోల్స్ చేస్తూ మీరు ఆనందం పొందుతున్నారు. కానీ నేను మానసికంగా అనారోగ్యం పాలవుతున్నాను, ఈ విషయాన్ని అర్ధం చేసుకోండి అంటూ సుప్రీత సోషల్ మీడియా వేదికగా ట్రోలర్స్ కి విజ్ఞప్తి చేసింది.