హీరో నాని - మృణాల్ ఠాకూర్, శృతి హాసన్ కలయికలో రేపు గురువారం విడుదలకాబోతున్న హాయ్ నాన్న ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి. నాని, మృణాల్ ఠాకూర్ స్పెషల్ గా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా, చెన్నై, ముంబై ప్రమోషన్స్ పూర్తి చేసిన నాని ఇప్పుడు ఓవర్సీస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ హాయ్ నాన్న ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ కూడా హాయ్ నాన్న ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నారు.
అయితే నాని నిన్న సాయంత్రం అభిమానులతో చిట్ చాట్ చేసాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకి ఓపిగ్గా సమాధానాలు చెప్పిన నాని.. తారక్ తో దిగిన పిక్ ని షేర్ చెయ్యమని అడిగిన అభిమానికి బిగ్ సర్ ప్రైజ్ ఇస్తూ ఎన్టీఆర్ తో ఉన్న పిక్ ని పోస్ట్ చేసాడు. అది చూసిన ఎన్టీఆర్ ఫాన్స్, నాని ఫాన్స్ పండగ చేసుకున్నారు. అలాగే హాయ్ నాన్న గురించి అడిగిన ప్రశ్నలకి సమాధానమిచ్చాడు. అయితే హాయ్ నాన్న పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయా అని అడగగా.. పెయిడ్ ప్రీమియర్స్ అయితే ఏమి లేవు.
కాకపోతే బుధవారం అంటే డిసెంబర్ 6 సినిమా విడుదలయ్యే ముందు రోజు సాయంత్రం AMB లో హాయ్ నాన్న ప్రీమియర్స్ ఉంటాయి. కొద్దిమంది స్నేహితులు, మీడియా వారికి షోస్ ఉంటాయి. ఆరో తారీఖు నైట్ కల్లా హాయ్ నాన్న ఉంటుందా? ఊడుతుందా అనేది తెలిసిపోతుంది. AMB lo 6th evening few shows for select people and media. 6th రాత్రి కళ్ల ఉందా ఊడిందా మీకు తెలిసిపోతుంది. ఉండిపోతుంది ఎప్పటికీ అని నా feeling :) #AskNani #HiNanna అంటూ హాయ్ నాన్న ఎప్పటికి అందరి గుండెల్లో ఊడిపోతుంది అని ట్వీట్ చెయ్యగా అది వైరల్ గా మారింది.