తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చేసారు, కేసీఆర్ ని ఘోరంగా ఓడించి కాంగ్రెస్ కి పట్టం కట్టారు. ప్రజలు గెలిపించారు కానీ.. మీరు మీరు కొట్టుకు చావండి అంటూ కాంగ్రెస్ ని వదిలేసారు అని ముందే సినీజోష్ చెప్పింది. తెలంగాణ 2023 ఎలక్షన్స్ లో BRS ని ఓడించి కాంగ్రెస్ ని ప్రజలైతే గెలిపించారు. కానీ కుర్చీ కోసం కొట్లాట మొదలవుతుంది అన్నట్టుగా ప్రస్తుతం కాంగ్రెస్ లో సీఎం కుర్చీ కోసం గలాటా స్టార్ట్ అయ్యింది. ఎంతో కష్టపడి బిక్కుబిక్కుమంటున్న కాంగ్రెస్ ని ఓ తీరానికి చేర్చి, పదేళ్లుగా అధికారానికి దూరమై బోసిపోయిన గాంధీ భవన్ కి కళ తెచ్చింది రేవంత్ రెడ్డే అనేది అందరికి తెలుసు.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అందరిని కలుపుకుపోదామంటే కలవారయే. సీనియర్ నేతలంతా బయటోడికి మనం గౌరవం ఇచ్చేదేమిటి అనే ఈగో. భట్టి, దామోదర, ఉత్తమ్, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్ ఇలా ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేఖించేవారే, ఎలాగో ఈ ఎన్నికలో ఒక్కతాటిపై నడిచారు, విజయం సాధించారు. ఇప్పుడైనా కలిసి కట్టుగా నిర్ణయాలుంటాయా అంటే అదీ లేదు. కాంగ్రెస్ గెలిచాక రేవంత్ సీఎం, భట్టి డిప్యూటీ సీఎం అనే ప్రచారం స్టార్ట్ అయ్యింది. కానీ గత రాత్రి నుంచే కాంగ్రెస్ లో హై డ్రామా స్టార్ట్ అయ్యింది.
ఫైనల్ గా ఒక్కో ఎమ్యెల్యేని అడిగి కనుక్కుంటే రేవంత్ రెడ్డే సీఎం అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇచ్చేందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీనియర్ నేతలు, మరో పక్క శ్రీధర్ బాబు కు స్పీకర్ ఇస్తాను అనడంతో.. నేను ఖాళీగా అయినా ఉంటాను కానీ నాకు అవసరం లేదు అంటూ శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే నాకు ఒక్కడికి మాత్రమే ఇవ్వాలి.. వేరే ఎవరికి ఇచ్చినా ఒప్పుకొనే ప్రసక్తి లేదు అంటూ భట్టి విక్రమార్కా ఆగ్రహం వ్యక్తం చెయ్యడం, ఎందుకంటే రేవంత్ రెడ్డి సీతక్కకి ఉపముఖ్యమంత్రి ఇవ్వమని అధిష్టాన్ని కోరడంతో అసలు గొడవ మొదలైంది.
సీతక్క కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేదే లేదు అని తేల్చి చెప్పిన సీనియర్ నేతలు, దానితో సీనియర్ నేతలు పౌరుష పదజాలంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో పరిణామాలు మారిపోయాయి. మరి ఈ అంతర్గత కుమ్ములాటల వలనే కదా కాంగ్రెస్ ప్రోపర్ గా విజయం సాధించలేకపోయేది. ఇప్పుడు తెలంగాణలోనూ అదే జరుగుతుంది.